Sweet Corn: శవాలను కాల్చిన బొగ్గులతో మొక్కజొన్న కాలుస్తున్నారంట..!

వానకాలంలో వేడివేడిగా మొక్కజొన్న తినటం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. ముఖ్యంగా కాల్చిన కంకులు తినటం అంటే మాములుగా ఉండదు. కానీ తెలంగాణలో రోడ్ల పక్కన కాల్చే వాళ్ళు వాడే బొగ్గు శ్మశానంలో శవాలను కాల్చిన బొగ్గు అంట.. !

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 16, 2023, 04:32 PM IST
Sweet Corn: శవాలను కాల్చిన బొగ్గులతో మొక్కజొన్న కాలుస్తున్నారంట..!

Sweet Corn: వర్షాకాలంలో వేడివేడిగా మొక్కజొన్న కంకులు తినడం అంటే ఎంతో ఇష్టంగా తింటుంటారు. వానాకాలం, చలికాలం అని తేడా లేకుండా చల్లని వాతావరణంలో వేడిగా తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఆ మొక్కజొన్న పొత్తులు కాల్చడానికి బొగ్గులు ఎక్కడ నుండి తెస్తారో ఎప్పుడైనా తెలుసుకున్నారా? మొక్కజొన్న తప్పా మిగితా వాటిపై ఆలోచన ఉండదు అంటారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే. 

ఏం జరిగిదంటే..?
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో ప్రకారం.. ఓ వృద్ధుడు శ్మశానంలో శవాలను కాల్చిన బొగ్గులను ఓ గొతంలో తీసుకొస్తున్నాడు. అది గమనించిన ఓ వ్యక్తి బైక్ పై ఆ వృద్ధుడ్ని వెంటాడాడు. ఆ పెద్దాయన్ని ఆపి బొగ్గులు ఎక్కడి నుంచి తెస్తున్నావని ప్రశ్నిస్తాడు. ఆ ముసలి ఆయన ముందు చెప్పడానికి తడబడ్డాడు. అయితే వీడియో రికార్డు చేసే వ్యక్తి గట్టిగా నిలదీశాడు. ఆ తర్వాత నోరువిప్పాడు. మొక్కజొన్న కంకులు కాల్చడానికి ఆ బొగ్గులు తీసుకెళ్తున్నాని వృద్ధుడు చెప్తాడు. నిజం తెలుసుకున్న బైక్ పై ఉన్న వ్యక్తి దెబ్బకి ఖంగుతిన్నాడు. 

ఈ బొగ్గులు మొక్కజొన్న కంకులు కాల్చడానికి తీసుకెళ్తున్నావా? అని వీడియో రికార్డు చేసే వ్యక్తి నిలదీస్తాడు. మొక్కజొన్న కాల్చేవాళ్లకి అమ్మడానికి బొగ్గులు తీసుకెళ్తున్నట్లు ఆ వృద్ధుడు తెలిపాడు. "ఇది మంచి పనేనా? దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి కదా?" అని వ్యక్తి ప్రశ్నిస్తాడు. అయితే అందుకు బదులు ఇవ్వకుండా ఆ వృద్ధుడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. 

శ్మశానంలో శవాలు కాల్చేసిన బొగ్గులు తీసుకెళ్లడానికి నీకు ఎవరు హక్కు ఇచ్చారని బైక్ పై వ్యక్తి అంటాడు. గ్రామ సర్పంచ్, అధికారులకు ఫోన్ చేస్తా ఆగు అని భయపెట్టగా.. మాట మాట్లాడకుండా ముసలి వ్యక్తి వెళ్లిపోతాడు. అయితే ఈ ఘటన తెలంగాణలో జరిగినట్లు తెలుస్తుండగా.. ఎక్కడ జరిగిందనే విషయం తెలియరాలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Also Read: Ganesh Chaturthi 2023 Offers: వినాయక చవితి స్పెషల్‌ ఆఫర్స్‌..Motorola E13 మొబైల్‌ కేవలం రూ.799కే.. 

అయితే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా చల్లని వాతావరణం ఉన్నప్పుడు మొక్కజొన్నలు ఇష్టంగా తినే వాళ్లకు ఇది పెద్ద సమస్యే అని చెప్పాలి. అన్ని ప్రాంతాల్లో మొక్కజొన్నలు కాల్చేందుకు ఇలాంటి శ్మశానంలో తెచ్చిన బొగ్గులు వినియోగించపోవచ్చు. ఇదే నిజమా అని నోరెళ్ల బెడుతున్నారు. 

ఛీ..చివరికి శవాలను కాల్చే బొగ్గులను కూడా వదలడం లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇంత దారుణానికి ఎలా చేస్తున్నారని మండిపడుతున్నారు. అయితే ఆ వృద్ధుడు ఏ శ్మశానంలో బొగ్గులు తెస్తున్నాడు. ఎవరికి అమ్ముతున్నాడనే విషయం క్లారిటీ రాలేదు. అయితే అది కేవలం ఒక్క ప్రాంతంలోనే జరుగుతుందా? లేదా ఇదే పెద్ద స్కామ్ లా జరుగుతుందా? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదీ ఏమైనా మొక్కజొన్న ఇష్టంగా తినే వారు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

Also Read: Tata Nexon vs Maruti Brezza: టాటా నెక్సాన్ వర్సెస్ బ్రిజాలలో ఏది మంచిది, ఏది తక్కువ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News