మంచిర్యాల: విధి ఆడిన వింత నాటకంలో ఆ తల్లిదండ్రులు బలి పశువులయ్యారు. ఎన్నో నోములు నోచి, పూజలు, వ్రతాలు చేస్తేగానీ సంతానం కలగలేదు. లేక లేక పుట్టిన ఆ పాపను భగవంతుడు తమపై చూపిన కరుణగా భావించారు. కానీ అల్లారుమద్దుగా చూసుకుంటున్న ఆ పాప పాముకాటుకు గురై చనిపోయింది. లేకలేక పుట్టిన తమ కంటిపాప ఇక లేదంటూ ఆ తల్లిదండ్రులు విలవిల్లాడిపోతున్నారు. ఈ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
ఆ వివరాలిలా ఉన్నాయి.... మంచిర్యాల జిల్లా భీమిని మండలం మాల్లాడికి చెందిన వెంకటన్నకు వివాహమైన 18 ఏళ్లకు కూతురు పుట్టింది. ఎన్నో పూజలు చేస్తే పుట్టినపాప తమ ఇంటిదీపంగా భావించారు. దీపిక అని పేరుపెట్టి కంటికిరెప్పలా చూసుకుంటున్నారు. ఇప్పుడు దీపికకు తొమ్మిదేళ్లు. కాగా స్థానిక పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో సోమవారం ఆడుకుంటున్న బాలిక ఓ పాము కాటుకు గురైంది.
దారుణం.. లిఫ్ట్ ఇచ్చి పొరుగింటి యువతిపై అత్యాచారం
దీపికను తల్లిదండ్రులు స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అందించిన ఆ డాక్టర్ విషం వల్ల పరిస్థితి విషమించిందని, మంచిర్యాలకు తీసుకెళ్లాలని సూచించారు. మంచిర్యాలకు తరలించి చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూనే దీపిక మంగళవారం చనిపోయింది సుదీర్ఘకాలం ఎన్నో నోములు నోచిన తర్వాత పుట్టిన బిడ్డ ఇకలేదన్న నిజాన్ని వెంకన్న కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. వీరి పరిస్థితి చూసి గ్రామస్తులు సైతం కన్నీటి పర్యంతమవుతున్నారు.
Avengers బ్యూటీ స్కార్లెట్ జాన్సన్ అందాలివిగో!