టీచర్లకు సంక్రాంతి సెలవులు రద్దు!

టీచర్లకు సంక్రాంతి సెలవులు రద్దు!

Last Updated : Jan 11, 2019, 09:18 AM IST
టీచర్లకు సంక్రాంతి సెలవులు రద్దు!

మేడ్చల్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ నిర్వహణకు అవసరమైన శిక్షణకు హాజరు కావాల్సి వున్న టీచర్లకు సంక్రాంతి సెలవులు రద్దు చేస్తున్నట్టు మేడ్చల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఐ విజయ కుమారి తెలిపారు. తెలంగాణ విద్యాశాఖ కమీషనర్, జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశాల మేరకే టీచర్లకు సెలవులు రద్దు చేస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల విధులకు 1,853 మంది టీచర్స్, హెడ్ మాస్టర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొంటారని చెప్పారు. 

ఈ నెల 21న తొలి విడత ఎన్నికల్లో భాగంగా శామీర్‌పేట, కీసర మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు ఆయా మండలాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ఇవ్వనున్న ఎన్నికల శిక్షణకు తప్పకుండా హాజరు కావాల్సి ఉంటుందని అన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులు తప్పకుండా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందుబాటులో ఉండాల్సిందిగా ఆమె సూచించారు.

Trending News