Nizamabad Accident: తెలంగాణలో మరో రోడ్డుప్రమాదం..ముగ్గురు మృతి..!

Nizamabad Accident: తెలంగాణలో మరోసారి రోడ్లు నెత్తురోడాయి. కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన మరవకముందే నిజామాబాద్‌లో మరో ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 10, 2022, 10:13 AM IST
  • తెలంగాణలో మరో రోడ్డుప్రమాదం
  • ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
  • అతి వేగం వల్లే ప్రమాదం
Nizamabad Accident: తెలంగాణలో మరో రోడ్డుప్రమాదం..ముగ్గురు మృతి..!

Nizamabad Accident: తెలంగాణలో మరోసారి రోడ్లు నెత్తురోడాయి. కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన మరవకముందే నిజామాబాద్‌లో మరో ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.   

నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈప్రమాదంలో భార్యాభర్తలు, పెద్ద కూతురు మృతి చెందారు. బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మృతులు భార్యాభర్తలు కృష్ణయ్య(36), రజిత(33), కూతురు రాఘవి(12)గా గుర్తించారు. చిన్న కుమార్తె శరణ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు..మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుప్రమాదంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్న కుమార్తె శరణ్య పరిస్థితి చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు.

 

Also read:iPhone 14 Max Price: ఐఫోన్ 14 మాక్స్ ధర లీక్.. ఎంతో తెలిస్తే షాకే! స్పెసిఫికేషన్‌లు ఇవే

Also read:Surya kumar Yadav: ముంబై టీమ్‌కు షాక్..స్టార్ ప్లేయర్ ఔట్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News