దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్జీవీ తెరకెక్కిస్తున్న గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ సినిమాకు సంబంధించిన పోస్టర్లు మహిళలని కించపర్చేలా వున్నాయని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ ప్రముఖ సామాజిక వేత్త దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వర్మపై ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ యాక్టు 2000 ప్రకారం సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా దేవిపై చేసిన అనుచితవ్యాఖ్యలకిగాను 506, 509 సెక్షన్లను కూడా ఈ ఎఎఫ్ఐఆర్ లో జోడించినట్టు తెలుస్తోంది. గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ సినిమా రిలీజ్ కి ఒక్క రోజు ముందు ఈ కేసు నమోదైంది.
ఇదిలావుంటే, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చిత్రాన్ని తెరకెక్కించి, పోస్టర్లు విడుదల చేస్తున్న రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేసి అతడు తెరకెక్కించిన గాడ్, సెక్స్ అండ్ ట్రూస్ సినిమాను ఆన్ లైన్ లో విడుదల కాకుండా నిషేధించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్, వైజాగ్ లలో మహిళా సంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.
వర్మ తెరకెక్కించిన గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ సినిమాలో అమెరికన్ పోర్న్ స్టార్ మియా మల్కోవా ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాలో మల్కోవా నటించిన నగ్న సన్నివేశాలకు సంబంధించిన పోస్టర్లను వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వివాదాస్పదమైంది.
రామ్ గోపాల్ వర్మను బుక్ చేసిన జీఎస్టీ