Revanth Praises Asad: పదేళ్ల కిందట అనుబంధం మళ్లీ తెలంగాణలో ఏర్పడుతుందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. బోటాబోటి మెజార్టీతో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోగా.. తాజాగా మజ్లిస్‌కు స్నేహ హస్తం చాచింది. తరచూ ఏఐఎంఐఎంపై రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మరోసారి మజ్లిస్ అధినేత అసదుద్దీన్‌ను ప్రశంసించారు. తమతో కలిసి వస్తే రెండోసారి కూడా అధికారంలోకి వస్తామని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.
Also Read: September 17th: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 17వ తేదీకి మరో కొత్త పేరు
"ప్రాఫెట్ ఫర్ ది వరల్డ్" పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పుస్తకావిష్కరణ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఒక మంచి పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు లభించింది. గీత, బైబిల్, ఖురాన్ సారాంశం ప్రపంచ శాంతి మాత్రమే. కలిసికట్టుగా దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్ని మత గ్రంథాలు చెబుతున్నాయి. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మన ప్రాంతానికి చెందిన వారు కావడం గర్వకారణం' అని తెలిపారు.
Also Read: Ganesh Immersion: గణేశ్ నిమజ్జనంలో మద్యం, అమ్మాయిలపై ఈవ్‌టీజింగ్.. ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్
ఈ సందర్భంగా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసద్‌ను ప్రస్తావిస్తూ.. 'గతంలో హైదరాబాద్‌లో ఒక వైపు ఓవైసీ, మరో వైపు నేను ఎంపీగా ఉన్నాం. అసదుద్దీన్ ఓవైసీ కొన్ని సార్లు కాంగ్రెస్‌పై కూడా విమర్శలు చేసేవారు. మంచి ప్రభుత్వాన్ని నడపాలంటే మంచి ప్రతిపక్షం కూడా ఉండాలి. పార్లమెంట్‌లో పేదల తరఫున మాట్లాడే నేతలు తగ్గిపోయారు. తెలంగాణలోని 17 మంది ఎంపీల్లో ఒక్క అసద్ మాత్రమే పేదల గురించి మాట్లాడుతున్నారు' అని ప్రశంసించారు.
'కార్పొరేట్ రంగంలో, వ్యాపారాల్లో మన వాళ్లు అగ్రగామిగా ఎదుగుతున్నారు.. పేదల తరఫున మాట్లాడే నాయకులు క్రమంగా తగ్గిపోతున్నారు. పార్లమెంట్‌లో పేదల కోసం మాట్లాడే వారిలో అసదుద్దీన్ ఓవైసీ ఒకరు' అని రేవంత్ తెలిపారు. 'ఎన్నికలు ముగిసే వరకే రాజకీయాలు.. ఆ తరువాత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం అంతా కలిసి పనిచేయాలి. మజ్లిస్ పార్టీ నుంచి వచ్చే సలహాలు, సూచనలను స్వీకరిస్తున్నాం' అని చెప్పారు.
'ఏళ్ల నుంచి మూసీ నది మురికి కూపంలా మారింది. మూసీ ప్రక్షాళన కోసం మజ్లిస్ సహకారం తీసుకుంటున్నాం. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను ఇవ్వనున్నాం. కలిసిమెలిసి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతాం. గతంలో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రావు ప్రభుత్వాలను రెండుసార్లు గెలిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా రెండోసారి అవకాశం వస్తుందని నమ్ముతున్న. ఈ పదేళ్ల పాటు పేదల సంక్షేమం కోసం పనిచేస్తాం' అని రేవంత్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.