Revanth Reddy : టిఎస్పీఎస్సీ చేపట్టిన ఆ నియామకాలను రివ్యూ చేయాలి

Revanth Reddy Satires on Bellampalli MLA Durgam Chinnaiah: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, " ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే గురించి ప్రస్తావించేందుకు తనకే సిగ్గనిపిస్తోంది " అని అన్నారు. " దుర్గం చిన్నయ్య గురించి మాట్లాడటానికి సిగ్గనిపిస్తోంటే.. మరి ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకోవడానికి వాళ్ల నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఏమనిపించడంలేదా ? " అని ప్రశ్నించారు.

Written by - Pavan | Last Updated : Jun 17, 2023, 07:18 PM IST
Revanth Reddy : టిఎస్పీఎస్సీ చేపట్టిన ఆ నియామకాలను రివ్యూ చేయాలి

Revanth Reddy Satires on Bellampalli MLA Durgam Chinnaiah: రాబోయే ఎన్నికల్లో బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసేందుకు మీది క్రియాశీలక పాత్ర కానుంది అని అక్కడి స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, ఓటర్లను ఉద్దేశించి రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకు బీజేపీ పెద్దలు, కేసీఆర్ కలిసి విశ్వ ప్రయత్నాలు చేశారు. అందుకోసం ఏకంగా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా ఓడించాలని అనుకున్నారు. కానీ కర్ణాటక ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించి బీజేపీని బండకేసి కొట్టారు. కర్ణాటకలో బీజేపీకి, తెలంగాణలో బీఆరెస్ పార్టీకి పెద్ద తేడా ఏం లేదు. అక్కడ బీజేపీది 40 శాతం కమీషన్ సర్కార్ కాగా, ఇక్కడ తెలంగాణలో బీఆరెస్ పార్టీది 30 శాతం కమీషన్ సర్కార్ అని రేవంత్ రెడ్డి తెలంగాణ సర్కారుపై మండిపడ్డారు.

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, " ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే గురించి ప్రస్తావించేందుకు తనకే సిగ్గనిపిస్తోంది " అని అన్నారు. " దుర్గం చిన్నయ్య గురించి మాట్లాడటానికి సిగ్గనిపిస్తోంటే.. మరి ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకోవడానికి వాళ్ల నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఏమనిపించడంలేదా ? " అని ప్రశ్నించారు. " బెల్లంపల్లి ఎమ్మెల్యే వ్యవహారం గురించి దేశమంతా తెలిసిపోయింది. ఆ ఎమ్మెల్యే చరిత్ర అంతమందికి తెలిసినప్పుడు మరి కేసీఆర్‌కు మాత్రం తెలియడంలేదా " అని విస్మయం వ్యక్తంచేశారు.

బెల్లంపల్లిలో ఉన్నది దుర్బుద్ధి చిన్నయ్యా ? లేక దుర్గం చిన్నయ్యా అర్థం కావడం లేదు అని బెల్లంపల్లి ఎమ్మెల్యె దుర్గం చిన్నయ్య పేరును ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలది ఒక దండుపాళ్యం ముఠా. శాండ్, ల్యాండ్, మైన్.. ఇలా అవినీతిలో ఎక్కడ చూసినా .. అక్కడ బీఆరెస్ నేతలే దర్శనం ఇస్తున్నారు. నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగం పెరిగిపోయింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం పనిచేయాల్సిన టీఎస్పీఎఎస్సీ కమిషన్ లోపభూయిష్టంగా తయారైంది అంటూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. టీఎస్పీఎఎస్సీ కమిషన్ సభ్యుల నియామకాలపై హైకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టినప్పటికీ.. ఈ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదన్నారు. పారదర్శకంగానే ఉద్యోగాల నియామకాలు చేపడుతున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు లాంటిది అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

ఇది కూడా చదవండి : TS Government New Scheme: గుడ్‌న్యూస్.. ఈ నెల 15న లక్ష సాయం.. ఇలా అప్లై చేసుకోండి

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కొనసాగుతున్న అనర్హులైన సభ్యులతో జరిగిన అన్ని నియామకాల్లో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకున్నందున.. నిరుద్యోగులకు సరైన న్యాయం జరిగేలా ఆ నియామకాలన్నింటిని పునఃసమీక్షించాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఉద్యోగ నియామకాల పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఇప్పటికే ఈ విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సైతం కేసు నమోదు చేసింది అని గుర్తుచేసిన రేవంత్ రెడ్డి ... సీబీఐ సైతం కేసు నమోదు చేసి మరింత లోతైన దర్యాప్తు చేపట్టాలి అని డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తే .. నిరుద్యోగులకు ద్రోహం చేసిన అసలు ద్రోహల జాతకాలు బయటపడతాయని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లేకేజీకి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కారణం. అందుకే మంత్రి కేటీఆర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. పేపర్ లీకేజీకి కారణమైన టీఎస్పీఎఎస్సీ చైర్మన్, సభ్యులను తక్షణమే తొలగించాలి అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి : Minister KTR Speech: మరో ఐదేళ్లలో పరిస్థితి ఎలా ఉంటుందంటే..

ఇది కూడా చదవండి : Bandi Sanjay About Journalists Plots: వేల కోట్ల విలువైన జర్నలిస్టుల ఇళ్ల స్థలంపై కేసీఆర్ కన్ను పడింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News