Revanth Request To Sonia: 'మేడమ్‌ జీ' తెలంగాణలో పోటీ చేయండి.. సోనియాకు రేవంత్‌ విజ్ఞప్తి

Sonia Contest In Telangana:  అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లోక్‌సభ సమరంలోనూ పునరావృతం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సరికొత్త వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ అధినేత్రి సోనియా గాంధీని తెలంగాణలో పోటీ చేయాలని కొన్నాళ్ల నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్వయంగా సోనియాను కలిసి ఈ విన్నపాన్ని చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 5, 2024, 10:41 PM IST
Revanth Request To Sonia: 'మేడమ్‌ జీ' తెలంగాణలో పోటీ చేయండి.. సోనియాకు రేవంత్‌ విజ్ఞప్తి

Lok Sabha Elections: తెలంగాణ నుంచి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పోటీ చేయాలని మొదటి నుంచి డిమాండ్‌ చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయాన్ని నేరుగా సోనియాకే విన్నవించారు. రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మా రాష్ట్రం నుంచి పోటీ చేయాల‌ని పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్రం నుంచి ఆమె పోటీ చేయాల‌ని ఇప్ప‌టికే పీసీసీ తీర్మానించింది. ఈ విష‌యాన్ని సోనియాకు వివరించారు. స్వరాష్ట్రం ఇచ్చిన మిమ్మల్ని గెలిపించేందుకు తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు సోమవారం బిజీబిజీగా గడిపారు. మొదట బిహార్‌లోని రాంచీలో, అనంతరం న్యూఢిల్లీలో పర్యటించారు. ఇక ఢిల్లీలో సోనియాను కలిసి పార్టీ వ్యవహారాలు, పరిపాలన విషయాలు పంచుకున్నారు. సీఎంతోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,  మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కలిసి పార్టీ అధినేత్రికి పలు విషయాలు నివేదించారు.

Also Read: Telangana Changes: తెలంగాణలో సమూల మార్పులు.. ఊరు, పేరు, చిహ్నం, తల్లి అన్నీ మార్పే

పీసీసీ కార్యవర్గం చేసిన విజ్ఞప్తిపై 'లోక్‌సభ ఎన్నికల పోటీ విషయమై స‌రైన స‌మ‌యంలో నిర్ణ‌యం తీసుకుంటా' అని సోనియా చెప్పినట్లు సమాచారం. ఈ సందర్భంగా సోనియాకు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పాలనా వ్యవహారాలను వివరించారు. ఎన్నిక‌లకు ముందు ఇచ్చిన ఆరు హామీల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, రాజీవ్ ఆరోగ్య‌శ్రీ ప‌రిమితి రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.15 ల‌క్ష‌లకు పెంచిన విషయాన్ని తెలిపారు. బ‌స్సుల్లో ఇప్ప‌టికే 14 కోట్ల మంది మ‌హిళ‌లు ఉచిత ప్ర‌యాణం చేశార‌ని గుర్తుచేశారు. రూ.500కే గ్యాస్ సిలెండ‌ర్, 200 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్ ఉచిత స‌ర‌ఫ‌రా హామీలను త్వరలో నెరవేరుస్తున్నట్లు సోనియాకు నివేదించారు. ఇక రాష్ట్రంలో బీసీ కుల గ‌ణ‌న చేపట్టేందుకు స‌న్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో అత్య‌ధిక స్థానాలు గెలిచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని ఈ సందర్భంగా పార్టీ వ్యూహ రచనను సోనియా ముందుంచారు. ప్ర‌తి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆశావాహుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించామ‌ని, వాటిపై పూర్తిస్థాయిలో క‌స‌ర‌త్తు చేసి బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తామ‌ని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌ సోనియాకు వివరించారు.

Also Read: Revanth Vs Harish Rao: తెలంగాణలో జల యుద్ధం.. రేవంత్‌ కాస్కో అంటూ సవాల్‌ విసిరిన హరీశ్‌ రావు

నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌తో భేటీ
అంతకుముందు ముఖ్యమంత్రి, మంత్రులు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మ‌న్ సుమ‌న్ భేరీని కలిశారు. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంటు రూ.1,800 కోట్లు వెంట‌నే విడుద‌ల‌ చేయాలని కోరారు. హైద‌రాబాద్‌లో మూసీ న‌ది రివ‌ర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాగు నీటి స‌ర‌ఫ‌రాకు అవ‌స‌ర‌మైన నిధులతో పాటు రాష్ట్రంలో త‌మ ప్ర‌భుత్వం వైద్య‌,ఆరోగ్య‌, విద్యా రంగాలకు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని సీఎం, మంత్రులు కోరారు.

రాహుల్‌ యాత్రలో..
ఢిల్లీ పర్యటనకు ముందు వారంతా బిహార్‌లో పర్యటించారు. పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన 'భార‌త్ న్యాయ్ యాత్ర‌'లో ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొన్నారు. రాహుల్‌ను కలిసి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించారు. అమ‌లు చేస్తున్న రెండు గ్యారంటీల విషయమై పంచుకున్నారు. పార్టీ కార్యక్రమాలు, లోక్‌సభ ఎన్నికలు, సోనియా గాంధీ పోటీ వంటి విషయాలను రాహుల్‌కు తెలిపారు. సోనియాను ఎలాగైనా ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News