Huzurabad: 'అబద్ధం చెప్పడానికి రేవంత్ రెడ్డికి సిగ్గు ఉండాలి. కర్ణాటక, తెలంగాణలో గ్యారెంటీల పేరుతో మోసం చేసి మహారాష్ట్రలోనూ గ్యారెంటీ పేరుతో మోసం చేయబోయారు. కానీ అక్కడి ప్రజలు గట్టి బుద్ధి చెప్పారు' అని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు మరాఠా గడ్డకు వెళ్లి ప్రచారం చేస్తే ఇక్కడ చేస్తున్న మోసం గ్రహించి గుణపాఠం చెప్పారు' అని వివరించారు.
ఇది చదవండి: K Kavitha: రేవంత్ రెడ్డి పది నిమిషాలు కేటాయించు: ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి
హుజురాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి ఆదివారం మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు, స్థానిక ప్రజలతో మాట్లాడారు. అనంతరం విలేకరుల సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ మహారాష్ట్ర ఎన్నికల్లో రేవంత్ రెడ్డితోపాటు అతడి మంత్రివర్గం చేసిన ప్రచారం.. అక్కడి ప్రజలు ఇచ్చిన తీర్పుపై స్పందించారు. ఇక్కడ మోసం చేసినట్టు అక్కడ మోసం చేయబోయారని తెలిపారు. కానీ అక్కడి ప్రజలు నమ్మలేదని గుర్తుచేశారు.
ఇది చదవండి: KTR vs Revanth: మళ్లీ రేవంత్ రెడ్డికి రాజకీయ జీవితం లేకుండా చేస్తాం: కేటీఆర్ హెచ్చరిక
'నూటొక్క దేవుళ్ల మీద ఒట్లు వేసి రేవంత్ రెడ్డి మోసం చేశాడు. మహిళలకు రూ.2,500, ఫించన్ పెంపు, వరి పంటకు బోనస్, తులం బంగారం ఇవ్వలేదు' అని హరీశ్ రావు గుర్తుచేశారు. మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన గుణపాఠంతో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ఓటమి తర్వాత అయినా బుద్ధి తెచ్చుకొని, వంద రోజుల్లో చేస్తామన్న హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
'కొత్త పథకాలు దేవుడెరుగు. మేము ఇచ్చినవి ఇవ్వడం లేదు. ఇప్పటికే విడుదలైన దళిత బంధు పథకం డబ్బులు వెంటనే ఇవ్వాలి' అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. లగచర్ల అంశంపై మాట్లాడుతూ.. 'అబద్ధం చెప్పడానికి సిగ్గు ఉండాలి. జులై 19వ తేదీన ఫార్మా సిటీ అని గెజిట్ ఇచ్చి ఇప్పుడు మాట మార్చి ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంటున్నావు. ముందు గెజిట్ వెనక్కి తీసుకోవాలి' అని కోరారు.
సగం తెలంగాణకు తాగునీరు కాళేశ్వరం ఇస్తోందని.. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి కేసీఆర్ నీళ్లు ఇచ్చాడని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు. 'తెలంగాణ రికార్డు స్థాయిలో కోటి 60 లక్షల ధాన్యం పండింది. ఇది కాళేశ్వరం గొప్పతనమే. కాంగ్రెస్ పార్టీ తమ గొప్పతనంగా చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇది ముమ్మాటికీ కేసీఆర్ గొప్పతనం' అని స్పష్టం చేశారు. మాటలు.. మూటలు కట్టుడు బంద్ చేసి గ్యారెంటీలు అమలు చేయాలని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు హితవు పలికారు. అసెంబ్లీలో దళితుల పక్షాన పోరాటం చేస్తామని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter