Revanth Reddy On Ktr: కాంగ్రెస్ పార్టీ, రాహుల్‌గాంధీ, రేవంత్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. రాహుల్ లెక్కంత.. ఆయన అర్హతేంది అని పర్సనల్ ఎటాక్ చేశారు. దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కల్వకుంట్ల ఫ్యామిలీది నీచమైన చరిత్ర అని ఫైరయ్యారు.
వరంగల్ రైతు సంఘర్షణ సభ విజయవంతం కావడంతో టీఆర్ఎస్ తో పాటు.. బీజేపీ, ఎంఐఎం పార్టీలకు భయం పట్టుకుందన్నారు రేవంత్ రెడ్డి. కలుగులోంచి బయటకొచ్చిన ఎలుకల్లాగా అందరూ మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీపై దాడికి దిగారన్నారు. కేటీఆర్ అహంభావంగా, ప్రజాస్వామ్యంపై అవగాహన లేకుండా మాట్లాడారన్నారు. రాహుల్ గాంధీ పొలిటికల్ టూరిస్టన్న కేటీఆర్.. ముందు కేసీఆర్ చరిత్ర తెలుసుకోవాలన్నారు. కేసీఆర్ కు రాజకీయ బిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. సింగిల్‌విండో డైరక్టర్‌గా ఓడిపోయినా కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ సింగిల్‌విండో ఛైర్మన్ పదవి ఇచ్చిందన్నారు. ఈ తర్వాత సిద్ధిపేట ఎమ్మెల్యేగా పోటీచేసి కూడా కేసీఆర్ ఓటమిపాలయ్యాడన్నారు. కేసీఆర్ రెండు చెంపలూ వాయించి అప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి కేటీఆర్ మాట్లాడాలన్నారు.
పిల్లి తావులు మార్చినట్లు ప్రతిసారీ ఒక్కోచోటు నుంచి పోటీచేసిన చరిత్ర కేసీఆర్దన్నారు రేవంత్‌రెడ్డి. సిద్ధిపేట నుంచి కరీంనగర్ ఎంపీకి అక్కడి నుంచి పాలమూరుకు మళ్లీ మెదక్ ఎంపీ స్థానానికి ఆ తర్వాత గజ్వేల్ శాసనసభకు పారిపోయిన చరిత్ర మర్చిపోయారా అని ప్రశ్నించారు. పారిపోవడంలో డాక్టరేట్ ఇస్తే అది కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కేటీఆర్ కు తన తాత ముత్తాతల చరిత్ర తెలియకుంటే చెప్పేవాళ్లు చాలామంది ఇంకా బతికే ఉన్నారని..... వారినడిగి విషయం తెలుసుకోవాలన్నారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదన్నారు.
పీవీ నరసింహారావును, మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థిక వేత్తను ప్రధానిని చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు రేవంత్‌రెడ్డి. ఎంతో మంది దళితులను ముఖ్యమంత్రులను చేయడంతో పాటు పార్లమెంటులోనూ వారికి గౌరవనీయమైన స్థానాన్ని కల్పించిందన్నారు. దళితున్ని సీఎం చేస్తానని మాటతప్పి.. చివరకు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కకుండా చేసిన నీచమైన చరిత్ర కేసీఆర్దన్నారు. భట్టి విక్రమార్క ను కాంగ్రెస్ సీఎల్పీ నేతను చేస్తే అది తట్టుకోలేక సంతలో పశువుల్ని కొన్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొన్నాడని మండిపడ్డారు. అసలు ఏ హోదాతో కేటీఆర్ రాహుల్‌గాంధీని విమర్శించాడని ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి. ఆంధ్రాలో, ఇతర రాష్ట్రాల్లో చదివిన కేటీఆర్ కు ముల్కీ నిబంధనల ప్రకారం ఇక్కడ ఛప్రాసీ పదవికి కూడా అర్హత లేదన్నారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడిగా, సహచర పార్లమెంటు సభ్యుడిగా రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్ ను ప్రవేశపెట్టారని రేవంత్ స్పష్టంచేశారు. పక్కరాష్ట్రాల సీఎంలతో కేసీఆర్ కలిస్తే చాణక్య నీతి.. తామ పార్టీ నేతలు ఈ రాష్ట్రానికి వస్తే పొలిటికల్ టూరిస్టులా అని ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి. ఏ గడ్డి తినడానికి కేసీఆర్ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా పోయాడో సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆదరణ చూసి ఓర్వలేక కలుగులోంచి ఎలుకలు బయటకొచ్చాయని.. రేపోమాపో ఫామ్‌హౌజ్ నుంచి పందికొక్కు కూడా బయటకొస్తుందని ఘాటుగా విమర్శించారు రేవంత్.
అమరవీరుల స్థూపం నిర్మాణంలోనూ అవినీతి జరుగుతోందని ఆరోపించారు రేవంత్‌రెడ్డి. 62 కోట్ల అంచనాలతో ప్రారంభించిన నిర్మాణ వ్యయం ఇప్పుడు 200 కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. ఏపీ కాంట్రాక్టర్ల కమిషన్లకు కక్కుర్తి పడి 150 కోట్ల అవినీతికి తెరలేపారన్నారు. తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడిన అంశంలో అవినీతిని.. కాంగ్రెస్ పార్టీ ఎట్టిపరిస్థితుల్లోనూ సహించదన్నారు. సంవత్సరంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దీనిపై విచారణ జరుపుతామన్నారు. ఇన్ని కోట్లు ఖర్చుపెట్టినా అమరవీరుల స్థూపం వద్ద మొండిగోడలు తప్ప ఇంకేంలేవన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో కుర్చీవేసుకొని కూర్చొని ఆ నిర్మాణాన్ని పూర్తిచేస్తామన్నారు. రాహుల్‌గాంధీ ఈ విషయంపై దృష్టిపెట్టాలని తమకు సూచించారన్నారు.
యాదగిరిగుట్ట ఆలయం కేసీఆర్ అవినీతికి, ధనదాహానికి బలైందన్నారు రేవంత్‌రెడ్డి. ఒక్క వర్షానికే అక్కడ భూకంపం వచ్చినట్లు పరిస్థితి తయారైందన్నారు. రెండువేల కోట్లు ఖర్చుపెట్టి కట్టిన గుడి కొట్టుకుపోయిందన్నారు. అమరవీరుల స్థూపం, యాదగిరిగుట్ట లో జరిగిన అవినీతిని తెలంగాణ ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించరన్నారు. అవినీతికి పాల్పడితే ఎవర్నైనా శిక్షిస్తామని చెప్పిన కేసీఆర్.. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారని నిలదీశారు. అమరవీరుల స్థూపంలో జరిగిన అవినీతికి కేటీఆర్, ఆయన స్నేహితులే కారణమని.. ఈ విషయంలో తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. అటు ప్రకాశ్‌రాజ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు రేవంత్‌రెడ్డి. కర్నాటకలో ఆయన పోటీచేస్తే ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. కేసీఆర్ కు ఇష్టమైతే ప్రకాశ్‌రాజ్ తో పాటు జ్యోతిలక్ష్మి, జయమాలినికి కూడా రాజకీయాల్లోకి తెచ్చుకోవచ్చని సెటైర్ వేశారు రేవంత్‌రెడ్డి.
also read: Indrakaran Reddy: రాజకీయ లబ్ధి కోసమే యాదాద్రిపై దుష్ప్రచారం: ఇంద్రకరణ్‌రెడ్డి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.