తెలంగాణ కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్ధి రేసులో రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. ఒకవైపు పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేస్తూనే సీఎం పీఠం కోసం పదునైన వ్యహాలతో ఆయన ముందుకు దూసుకువెళ్తున్నారు. సీఎం పదవిని అందుకునేందుకు వైఎస్ తరహాలో ఆయన ద్విముఖ వ్యహాన్ని అనుసరిస్తున్నారు . ఒకవైపు అధిష్టానం ముందు తన పలుకుపడి పెంచుకుంటూనే మరోవైపు అభ్యర్ధులను గ్రిప్ లో పెట్టుకునే పనిలో పడ్డారు రేవంత్..
అధిష్టానం వద్ద పలుకుపడి కోసం విశ్వయత్నాలు
కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అభ్యర్ధిగా ఎంపిక అవ్వాలంటే అధిష్టానం మెప్పు పొందడం అనేది చాలా ప్రధానం అంశం. అధిష్టానికి పూర్తిస్థాయిలో విధేయత కనబర్చినోళ్లకు ఈ పదవి వరిస్తుంది. గతంలో వైఎస్ తో పాటు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో ఇది రుజువైంది కూడా..గత ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ ఇదే విధానాన్ని అమలు చేస్తోంది. ఈ సత్యాన్ని గ్రహించిన రేవంత్ రెడ్డి.. అధిష్టానం మెప్పుకోసం తెగ ఆరాటపడుతున్నారు. రాహుల్, సోనియా సభను నిర్వహించే బాధ్యతలను తీసుకోవడం ఇందుకు నిదర్శనం.. అలాగే ప్రతి సభలోనూ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
రేవంత్ రెడ్డి టాలెంట్ ను గుర్తించి అధిష్టానం ఆయన్ను అదే స్థాయిలో ప్రోత్సహిస్తోంది. ఆయన ప్రచారానికి హెలికాఫ్టర్ ను అందుబాటులో తెచ్చిందంటే రేవంత్ కు ఏ మేరకు ప్రాధాన్యత ఇస్తోంది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సోనియా సభను నిర్వహించే బాధ్యతలను రేవంత్ సక్రమంగా నిర్వహించడంతో ఆయనపై రాహుల్, సోనియాలకు గుడ్ ఇంప్రెషన్ ఏర్పడిందని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. రాహుల్ ను తన కొడంగల్ నియోజకవర్గానికి రప్పించుకొని సభ ఏర్పాటు చేస్తున్నారంటే ఆయన మాటకు అదిష్టానం వద్ద ఏ స్థాయిలో విలువ ఇస్తుందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇలా అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవాలనే వ్యూహంలో రేవంత్ చాలా వరకు సక్సెస్ అయినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి
అభ్యర్ధులను గ్రిప్ లో పెట్టుకునే ప్రయత్నం
తెలంగాణ ఫైర్ బ్రాండ్ నేత రోజు రోజుకు రాటుదేలుతున్నారు.. పదునైన మాటలతో టీఆర్ఎస్ పాలను తీవ్ర స్థాయిలో ఎండగడుతున్నారు. కేసీఆర్ తీరుపై తెగ విరుచుకుపడుతున్నారు. రేవంత్ వస్తే తాము గెలుస్తామన్న ధీమా అభ్యర్ధుల్లో నెలకొంది. దీంతో రేవంత్ ప్రచారం కోసం అభ్యర్ధులు క్యూకడుతున్నారు. 100కిపైగా నియోజకవర్గాల్లో ఆయన ప్రచారానికి షెడ్యూల్ పెట్టుకున్నారంటే ఆయనకు ఎంతటి డిమాండ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి రేవంత్ ఏ స్థాయిలో దూసుకెళ్లున్నారో అర్ధం చేసుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుత్నారు
ఇలా వైఎస్ తరహాలో రేవంత్ రెడ్డి ఒకవైపు అధిష్టానం మెప్పు పొందుతూనే మరోవైపు అభ్యర్ధుల గెలుపును కృషి చేసి అభ్యర్ధులను గ్రిప్ లో పెట్టుకుంటున్నారు. రేవంత్ అనుసరిస్తున్న ద్విముఖ వ్యూహం ఏ మేరకు సక్సెస్ అవుతుందనే విషయం తేలాలంటే ఎన్నికల ముగిసే వరకు వేచిచూడాల్సిందే.... ఒక వేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ ను సీఎం అభ్యర్ధింగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.