ఓల్డ్ సిటీ సహా నక్సల్ ఏరియాలో ప్రత్యేక బలగాల మోహరింపు

తెలంగాణలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది

Last Updated : Apr 10, 2019, 04:58 PM IST
ఓల్డ్ సిటీ సహా నక్సల్ ఏరియాలో ప్రత్యేక బలగాల మోహరింపు

తొలి విడుత ఎన్నికల్లో భాగంగా రేపు తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది . రేపు ఉదయం 7 నుంచి 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే నిజామాబాద్ లో మాత్రం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 34,604 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు. ఏర్పాట్లలో భాగంగా ఈవీఎంలను పరిశీలించి ఆయా కేంద్రాలకు సిబ్బంది తీసుకెళ్తున్నారు. ఇదిలా ఉండగా ఖమ్మం, వరంగల్ లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా దళాలను మోహరించారు. అలాగే హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ సిటీలో ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సిసి కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశారు.

Trending News