Rains in Telangana: తెలంగాణలో నేటి నుంచి ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్,పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం నైరుతి దిశకు విస్తరించింది. ఈ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్‌లో ఈ ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతానికి హైదరాబాద్ ఎల్లో వార్నింగ్ జోన్‌లో లేదు. సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో నగరంలో 5 సెం.మీ నుంచి 6 సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇప్పటికే రెండు రోజులుగా ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం (జూలై 4) అత్యధికంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 13.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇదే జిల్లాలోని నెన్నెలలో 9.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా పాతరాంజపేటలో 12.8 సెం.మీ, ఆదిలాబాద్ జిల్లా పొచ్చెరలో 10.4 సెం.మీ, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో 9.2 సెం.మీ వర్షం కురిసింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) July 4, 2022
Also Read: Horoscope Today July 5th: నేటి రాశి ఫలాలు.. ఆ రంగాల్లోని వ్యాపారులకు ఇవాళ ధన లాభం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook