Prashant Kishor Advise to CM KCR: కేసీఆర్‌ను మించిన వ్యూహకర్త ఎవరూ లేరని చెబుతూనే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సేవలను ఉపయోగించుకోనుంది టీఆర్ఎస్. కేసీఆర్ వ్యూహాలకు పీకే టీమ్ మరికాస్త శక్తిని జోడించగలదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓవైపు పీకే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో టీఆర్ఎస్ కోసం పీకే టీమ్ పోషించాల్సిన పాత్రపై గులాబీ బాస్ కేసీఆర్ పీకేతో రెండు రోజుల పాటు సుదీర్ఘ మంతనాలు జరిపారు.
కేసీఆర్-పీకే మధ్య జరిగిన చర్చల్లో ఐప్యాక్ టీఆర్ఎస్ కోసం పనిచేయాల్సిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. అలాగే, ఐప్యాక్ అందించాల్సిన సేవలపై కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు. అదే సమయంలో పీకే నుంచి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు, జాతీయ రాజకీయాలపై చర్చించిన ఇద్దరు... కొన్ని అంశాలపై ఒక అవగాహనకు వచ్చారు. వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానికి సంబంధించి రానున్న రోజుల్లో రోడ్ మ్యాప్ రూపొందించనున్నారు.
కేసీఆర్‌కు పీకే సూచన :
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బలాబలాలు, బలహీనతలపై పీకే టీమ్ ఇప్పటికే విస్తృతంగా సర్వే చేసింది. కేసీఆర్‌తో తాజా భేటీలో సర్వే రిపోర్టుపై పీకే చర్చించారు. వచ్చే ఎన్నికల్లో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాల్సి ఉంటుందని సూచించారు. ప్రజా వ్యతిరేకతతో పాటు సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదుర్కొంటున్న పలువురు ప్రజా ప్రతినిధుల పేర్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రజా వ్యతిరేకత ఉన్నా కేసీఆర్ మళ్లీ టికెట్ ఇస్తారనే ధైర్యం కొంతమంది ఎమ్మెల్యేల్లో కనిపిస్తోందని చెప్పినట్లు సమాచారం. దీనిపై కేసీఆర్ ఎలా స్పందించారనేది తెలియరాలేదు. కాగా, పీకే ప్రస్తావించిన ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఓట్లు చీలితే టీఆర్ఎస్‌కే లాభం :
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని పీకే కేసీఆర్‌తో చెప్పారు. అదే జరిగితే టీఆర్ఎస్‌కు లాభిస్తుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి లోక్‌సభ సీట్లు తగ్గుతాయని చెప్పారు. జాతీయ స్థాయిలో కొత్త ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌కు కూడా అందులో చోటివ్వాలని పీకే కోరారు. అయితే కేసీఆర్ మాత్రం తాము బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటిస్తామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయ కూటమి రూపుదిద్దుకోని పక్షంలో అవసరమైతే జాతీయ పార్టీ పెట్టే ఆలోచనలోనూ ఉన్నట్లు కేసీఆర్ పీకేతో చెప్పినట్లు తెలుస్తోంది.
పీకే టీమ్ టీఆర్ఎస్‌కు అందించే సేవలు
పొలిటికల్ సర్వేలు, టీఆర్ఎస్ చేసిన, చేపట్టిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం, కొత్తగా ఓటు వేయబోతున్నవారిని ఆకర్షించేలా వ్యూహాలు సిద్ధం చేయడం... తదితర అంశాల్లో పీకే టీమ్ నుంచి సేవలు ఆశిస్తున్నట్లు ప్రశాంత్ కిశోర్‌తో కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read: LSG vs MI: రాహుల్ క్లాసిక్ సెంచరీ.. లక్నో ఘన విజయం! ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై ఔట్
Also Read: Todays Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం ధర, ఏప్రిల్ 25, 2022 ఇవాళ్టి బంగారం ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.