తెలంగాణలో ముగిసిన పోలింగ్: పోలైన ఓట్ల శాతంపై ఉత్కంఠత

                 

Last Updated : Dec 7, 2018, 05:32 PM IST
తెలంగాణలో ముగిసిన పోలింగ్: పోలైన ఓట్ల శాతంపై ఉత్కంఠత

తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ గడువు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ బూత్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అలాగే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో నాలుగు గంటలకే పోలింగ్ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో అక్కడ సాయంత్రం నాలుగు గంటల వరకు క్యూలైనల్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. కాగా ఇప్పటి వరకు ఈసీ నుంచి వచ్చిన అధికారిక సమాచారం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు  56.17 శాతం నమోదు అయింది. పోలింగ్ గడువు ముగిసిన సమయంలో క్యూలైన్లో ఉన్నవారు ఓటు వేసిన తర్వాత ఈసీ మొత్తం ఓటింగ్ శాతం ప్రకటిస్తుంది. 

మధ్యాహ్నానికి పడిపోయిన ఓటింగ్ శాతం
ఉదయం నుంచి ఫాస్ట్ ట్రాక్ పై నడిచిన పోలింగ్ కాస్త మధ్యాహ్నానికి అమాంతగా పడిపోయింది. ఈసీ ఇచ్చిన సమాచారం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటల వరకు కాస్త అటు ఇటుగా 50 శాతం ఉన్న పోలింగ్ కాస్త మధ్యాహ్నం 3 గంటలకు 56.17 శాతం నమోదు కావడం గమనార్హం. అంటే రెండు గంటల్లో 6 శాతం మాత్రమే నమోదైనట్లు తెలుస్తోంది

గతంలో ఎన్నికలతో పోల్చితే ...
ఆయా జిల్లాల వారీగా తీసుకున్న సమచారం ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు 65 శాతం పోలింగ్ నమోదు అయినట్లు తెలిసింది. ఇంకా పోలింగ్ బూతుల్లో జనాలు ఓట్లు వేస్తున్నందున ఈ శాతం 2 నుంచి 3 శాతం పెరిగే అవకాశముంది. గత ఏడాది ఎన్నికల్లో 68.5 శాతం నమోదైంది. గతంతో పోల్చితే పోలింగ్  తక్కువ శాతం నమోదు అవుతుందని కొందరు అంచనా వేస్తుంటే.. గతం కంటే ఈ సారి కొంత పెరిగే అవకాశముందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కాస్త అటూ ఇటూగా గతంలో పోలైన ఓట్ల పడే అవకాశముంది. 

Trending News