Rave Party: కూకట్‌పల్లిలో రేవ్ పార్టీ భగ్నం... అంతా స్వలింగ సంపర్కులే...!

Rave party in Kukatpally: కూకట్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌పై దాడులు చేసిన పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఈవెంట్‌లో పాల్గొన్న 44 మంది యువకులతో పాటు ఇద్దరు హిజ్రాలను అదుపులో తీసుకున్నారు. పట్టుబడిన యువకులంతా హోమో సెక్సువల్స్‌గా అనుమానిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2021, 03:19 PM IST
  • కూకట్‌పల్లిలోని వివేకానంద నగర్‌లో రేవ్ పార్టీ
    స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు దాడులు
    పోలీసుల అదుపులో 44 మంది యువకులు, ఇద్దరు హిజ్రాలు
Rave Party: కూకట్‌పల్లిలో రేవ్ పార్టీ భగ్నం... అంతా స్వలింగ సంపర్కులే...!

Rave party in Kukatpally: హైదరాబాద్‌లోని (Hyderabad) కూకట్‌పల్లిలో రేవ్ పార్టీని (Rave party) పోలీసులు భగ్నం చేశారు. హుక్కా, మద్యం మత్తులో మునిగి తేలుతున్న 44 మంది యువకులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు హిజ్రాలను కూడా అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడినవారంతా హోమో సెక్సువల్స్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. పలు సోషల్ యాప్స్ ద్వారా స్వలింగ సంపర్కులను (Homosexual) ఒక్కచోటకు చేర్చి ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

కూకట్‌పల్లిలోని (Kukatpally) వివేకానందనగర్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం (నవంబర్ 27) రాత్రి ఈ రేవ్ పార్టీ జరిగింది. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అపార్ట్‌మెంట్‌పై దాడులు చేశారు. దాదాపు 44 మంది యువకులు, ఇద్దరు హిజ్రాలు (Hijra) మద్యం మత్తులో నానా హంగామా చేస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు, కండోమ్ ప్యాకెట్లు, హుక్కాను స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీకి (Rave party) హాజరైన యువకుల నుంచి రూ.1000 చొప్పున నిర్వాహకులు వసూలు చేసినట్లు గుర్తించారు. 

కొంతమంది యువకులు ఒక టీమ్‌గా ఏర్పడి ప్రతీ వీకెండ్‌లో ఇలాంటి పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు (Hyderabad police) గుర్తించారు. వాట్సాప్‌తో పాటు మీట్ మీ, లొకంటో తదితర సోషల్ యాప్స్ ద్వారా హోమ్ సెక్సువల్స్‌ను (Homosexual)ఆకర్షించి ఈ ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టుబడినవారిలో పలువురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నట్లు సమాచారం. వీరందరినీ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈవెంట్ నిర్వాహకులైన ఇమ్రాన్, దయాల్ అనే ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఇండియాలో ఒమిక్రాన్ ప్రకంపనలు, అప్రమత్తమైన వివిధ రాష్ట్రాలు

సాధారణంగా హైదరాబాద్ (Hyderabad) శివారు ప్రాంతాల్లో రేవ్ పార్టీల గురించి ఎక్కువగా వింటుంటాం. కానీ నగరం మధ్యలో ఉన్న కూకట్‌పల్లిలో రేవ్ పార్టీ నిర్వహించడం కలకలం రేపుతోంది. రేవ్ పార్టీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News