/telugu/photo-gallery/tspsc-group-4-final-result-2024-category-wise-selected-candidates-list-check-full-details-here-rn-180895 TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. 180895

PM Narendra Modi Hot Comments on CM KCR: తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావడం లేదన్నారు. శనివరం సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని.. అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణలో కుటుంబ పాలనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ముందుగా ప్రధాని తెలుగు ప్రసంగం ప్రారంభించడం విశేషం. ప్రియమైన సోదర సోదరీమణులారా.. అంటూ ప్రసంగం మొదలుపెట్టారు. 

తెలంగాణ ప్రజలు కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కేంద్రం చేపడుతున్న ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల ప్రజలు నష్టపోతున్నారని అన్నారు. అవినీతి, కుటుంబ పాలన వేర్వేరు కాదంటూ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కుటుంబ పాలన, అవినీతి రాజ్యమేలుతుయంటూ ఫైర్ అయ్యారు. తండ్రి, కొడుకు, కుమార్తె ఇలా అందరూ అధికారంలో ఉన్నారని.. కుటుంబ పాలక కారణంగానే అవినీతి పెరిగిపోయిందన్నారు. 

కొంతమంది అభివృద్ధికి అడ్డుపడుతున్నారని.. ప్రజల సొమ్ము అవినీతిపరులకు చేరకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దేశంలో అవినీతిపరులను శిక్షించాలా వద్దా..? అని ప్రశ్నించారు. అవినీతిపై పోరాటం చేయాలా..? వద్దా..? అని అడిగారు. కుటుంబ పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు. దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను పెంచామని.. ఇంతకు ముందు ఎందుకు డిజిటల్ పేమెంట్స్ జరగలేదన్నారు.  

Also Read: CNG PNG New Price: బిగ్‌ రిలీఫ్.. గ్యాస్‌ ధరలు తగ్గింపు.. నేటి నుంచే అమలు

కోవిడ్, ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ప్రపంచం అంతా తిరోగమనంలోకి వెళితే.. భారత్‌ మాత్రం అభివృద్ధివైపు దూసుకుపోతుందని ప్రధాని మోదీ అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఈ ఏడాది మౌలిక వసతుల కల్పన కోసం 10 లక్షల కోట్ల రూపాయలు కేటాయించామని గుర్తు చేశారు. తెలంగాణలో రూ.35 వేల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టామన్నారు. అదేవిధంగా జాతీయ రహదారుల విస్తరణకు భారీగా నిధులు కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో భారీ టెక్స్‌టైల్‌ పార్క్‌ నిర్మించుకున్నామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా రైల్వే సర్వీసులు చేపట్టామని.. ఎంఎంటీఎస్ విస్తరణ చేపట్టడం  ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో తెలంగాణ భాగమయ్యేలా చేశామని.. 11 వేల కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించామని అన్నారు.

అంతకుముందు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో రాష్ట్రంలో రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ రైలు ప్రారంభంతో సికింద్రాబాద్-తిరుపతి నగరాల మధ్య ప్రయాణ సమయం 8.30 గంటలు పట్టనుంది. ప్రస్తుతం సూపర్‌ ఫాస్ట్‌ ట్రైన్‌లో సికింద్రాబాద్ నుంచి తిరుపతి చేరుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Also Read: Vande Bharat Express: సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించిన మోదీ.. ప్రయాణ సమయం ఎంతంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
PM Modi Hyderabad Tour pm narendra modi speech at parade ground secunderabad and modi criticized cm kcr govt
News Source: 
Home Title: 

PM Modi Speech @ Parade Ground: CM KCR టార్గెట్‌గా PM Modi ప్రసంగం.. అవినీతిపరులపై చర్యలు ఖాయం

PM Modi Speech @ Parade Ground: CM KCR టార్గెట్‌గా PM Modi ప్రసంగం.. అవినీతిపరులపై చర్యలు ఖాయం
Caption: 
PM Narendra Modi on CM KCR (Source: Twitter)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
PM Modi Speech: CM KCR టార్గెట్‌గా PM Modi ప్రసంగం.. అవినీతిపరులపై చర్యలు ఖాయం
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Saturday, April 8, 2023 - 16:36
Created By: 
Krindinti Ashok
Published By: 
Krindinti Ashok
Request Count: 
73
Is Breaking News: 
No