PM Modi calls Bandi sanjay: బండి సంజయ్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు..ఎందుకంటే..!

PM Modi calls Bandi sanjay: తుక్కుగూడ సభ తర్వాత కమలనాథుల్లో కొత్త జోష్‌ కనిపిస్తోంది. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సక్సెస్ కావడంపై పార్టీ పెద్దల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈక్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఈసందర్భంగా బండి సంజయ్‌ను అభినందించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 15, 2022, 04:55 PM IST
  • తుక్కుగూడ సభతో కమలనాథుల్లో జోష్
  • ప్రజాసంగ్రామ యాత్ర సక్సెస్
  • బండిసంజయ్‌కు ప్రధాని మోదీ ఫోన్
PM Modi calls Bandi sanjay: బండి సంజయ్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు..ఎందుకంటే..!

PM Modi calls Bandi sanjay: తుక్కుగూడ సభ తర్వాత కమలనాథుల్లో కొత్త జోష్‌ కనిపిస్తోంది. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సక్సెస్ కావడంపై పార్టీ పెద్దల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈక్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఈసందర్భంగా బండి సంజయ్‌ను అభినందించారు. ఇలాగే ముందుకు వెళ్లాలన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర, తుక్కుగూడ సక్సెస్‌పై ఆరా తీశారు. 

పాదయాత్రలో పాల్గొన ప్రతి ఒక్క కార్యకర్తను ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. సాయిగణేష్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఖమ్మం వెళ్తుండగా మార్గమధ్యలో బండి సంజయ్‌కు ప్రధాని ఫోన్ చేశారు. పెద్దలు ఇచ్చిన స్ఫూర్తితోనే పాదయాత్ర చేపట్టానని ఈసందర్భంగా మోదీతో ఆయన అన్నారు. సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్‌ పాలన రాష్ట్రంలో తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. 

పాదయాత్రలో ప్రజల స్పందన ఎలా ఉందో సంజయ్‌ నుంచి ప్రధాని మోదీ తెలుసుకున్నారు. కేసీఆర్ పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని ప్రధానికి వివరించారు. కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు కాకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఈ సందర్భంగా బండి సంజయ్‌ ..మోదీ దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు తెలుసుకుంటున్నారని చెప్పారు. 

తెలంగాణలోనూ బీజేపీ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ప్రధానికి బండి సంజయ్ వివరించారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చామన్నారు. కేంద్రమంత్రి అమిత్ షా(AMITH SHAH), పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాకతో నేతలు, కార్యకర్తల్లో జోష్‌ పెరిగిందన్నారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ప్రధానికి బండి సంజయ్ తెలిపారు. ప్రధాని ఫోన్‌తో తమల్లో మరింత విశ్వాసం పెరిగిందన్నారు.
 

Also read:Minister Harish Rao: అమిత్ షా కాదు..అబద్ధాల షా..మంత్రి హరీష్‌రావు సెటైర్లు..!

Also read:Thomas Cup 2022: బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. 73 ఏళ్ల త‌ర్వాత..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News