Hyd Metro: హైదరాబాద్‌ మెట్రోకు పూర్వ వైభవం దక్కేనా..రోజువారి ప్రయాణికుల సంఖ్య ఎంతంటే..!

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోకు పూర్వ వైభవం వస్తుందా..?కరోనా తర్వాత పరిస్థితులు మారుతున్నాయా..?మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి ఏం చెబుతున్నారు..?

Written by - Alla Swamy | Last Updated : Aug 10, 2022, 10:20 AM IST
  • హైదరాబాద్ మెట్రో
  • పెరుగుతున్న ప్రయాణికు సంఖ్య
  • తాజాగా రికార్డు స్థాయిలో నమోదు
Hyd Metro: హైదరాబాద్‌ మెట్రోకు పూర్వ వైభవం దక్కేనా..రోజువారి ప్రయాణికుల సంఖ్య ఎంతంటే..!

Hyderabad Metro: మెట్రో రైలుకు పూర్వ వైభవం వస్తున్నట్లు కనిపిస్తోంది. గతకొంతకాలంగా అందులో ప్రయాణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా తర్వాత సోమవారం అత్యధిక మంది ప్రయాణం చేశారు. 8న 3.94 లక్షల మంది మెట్రోలో తిరిగారు. రెండేళ్ల తర్వాత ఈస్థాయిలో నగరవాసులు ప్రయాణించడం ఇదే తొలిసారి. కరోనా ముందు అంటే 2020 ఏప్రిల్‌ నెలలో 4 లక్షల మంది ప్రయాణించారు.

ఆ తర్వాత 5 లక్షల మార్క్‌ను సింపుల్ దాటుతుందని అంతా భావించారు. ఆ సమయంలో ఒక్కసారి కరోనా విజృంచింది. భారతావని లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. దేశవ్యాప్తంగా రైళ్లులన్నీ డిపోలకే పరిమిత అయ్యాయి. ఆ తర్వాత క్రమంగా సడలింపు ఇచ్చారు. ఐనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టించడంతో ఆ ప్రభావం మెట్రోపై పడింది. కనీస అవసరాలకు డబ్బులు రాని పరిస్థితి నెలకొంది.

ప్రస్తుతం నగరంలో కార్యాకలాపాలు జోరందుకున్నాయి. ఐటీ కంపెనీలన్నీ తెరుచుకున్నాయి. 35 శాతం మంది ఉద్యోగులు ఆఫీసులకు వెళ్తున్నారు. ఐటీ కార్యాకలాపాలు మొదలు కావడంతో మెట్రోకు కళ వచ్చింది. ప్రయాణికుల సంఖ్య క్రమేపి రెట్టింపు అవుతోంది. ఇటీవల ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. దీంతో నాగోల్-రాయదుర్గం మార్గంలో మెట్రోలో ప్రయాణికులు పెరిగారు.

మియాపూర్, ఎల్బీనగర్ మార్గంలోనూ ప్రయాణికుల సంఖ్య పెరిగింది. వర్షాల కారణంగా చాలా మంది రోడ్లపైకి కంటే మెట్రోపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఇటీవల మెట్రో స్టేషన్‌లన్నీ ప్రయాణికులతో నిండిపోతున్నాయి. ఈ విషయాన్ని మెట్రో ఎండీ కేవీబీరెడ్డి వెల్లడించారు. వీకెండ్ రోజుల్లో ప్రయాణికుల సంఖ్య తగ్గుతోందని..అదే సమయంలో వీకెండ్ కార్డు దారులు వస్తున్నారని తెలిపారు.

ప్రస్తుతం రోజు 3.50 లక్షల నుంచి 3.60 లక్షల మంది ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు. ఈనెల 8న అత్యధికమంది ప్రయాణించారని..ఒకేరోజు 3.94 లక్షల మంది పయనించారన్నారు. ఇది ఇలాగే కొనసాగితే మెట్రోకు కాసుల పంట రానుందన్నారు కేవీబీ రెడ్డి.

Also read:Raksha Bandhan: రక్షాబంధన్ సందర్భంగా మీ చేతులను గోరింటాకుతో అలంకరించుకోండి..డిజైన్లు ఇవే..!

Also read:Shikhar Dhawan: టీ20ల్లో రాకపోవడానికి ఏదో కారణం ఉంది..శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News