Palwancha Ramakrishna family suicide case, "Encounter the Vanama Raghava" Demanding locals : పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో నిందితుడైన వనమా రాఘవ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కోర్టు వనమా రాఘవకు (Vanama Raghava) 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. వనమా రాఘవేంద్రరావు వల్ల ఒక కుటుంబం మొత్తం ప్రాణాలు తీసుకోవాల్సి వచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు (Kothagudem MLA Vanama Venkateswara Rao) కుమారుడు అయిన వనమా రాఘవ అరాచకాలకు హద్దు లేకుండా పోయింది.
నీ ఆస్తి నీకు దక్కాలంటే భార్యను పంపాలంటూ రామకృష్ణను (Ramakrishna) మానసికంగా వేధించడంతో ఆ రామకృష్ణ, భార్యాపిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వివాదం ఇప్పుడు దుమారం రేపుతోంది. మొదట వనమా రాఘవను (Vanama Raghava) హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు ప్రచారం సాగింది. అయితే రాఘవ మాత్రం పోలీసులను (police) తప్పించుకుని తిరిగాడు.
తర్వాత అశ్వారావుపేట నియోజకవర్గంలోని (Aswaraupeta constituency) దమ్మపేట.. చింతలపూడి పరిసర ప్రాంతాల్లో వనమా రాఘవను పోలీసులు పట్టుకున్నారు. పాల్వంచ నుంచి అటవీ మార్గం ద్వారా దమ్మపేట, (Dammapeta) అటు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తప్పించుకుని వెళ్లే క్రమంలో వానమా రాఘవ అరెస్ట్ చేశారు పోలీసులు.
ఇక పాల్వంచ రామకృష్ణ కుటుంబం సూసైడ్ కేసులో (Ramakrishna family suicide case) వనమా రాఘవేంద్ర ఏ2 గా ఉన్నాడు. వనమా రాఘవేంద్ర వేధింపులు తాళలేక ఈ నెల 3న తన ఇద్దరు కూతుర్లు, భార్యతో రామకృష్ణ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
అయితే రామకృష్ణ తన కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సూసైడ్ నోట్ రాశారు. సెల్ఫీ వీడియోలు రికార్డ్ చేశారు. ఆ వీడియోలు బయటకు రావడంతో వనమా రాఘవ ఆగడాలన్నీ బయటపడ్డాయి. తాను డబ్బులు అడిగితే ఇచ్చేవాడిని కానీ వనమా రాఘవేంద్ర తన భార్యను పంపమని అడిగాడంటూ రామకృష్ణ రికార్డ్ చేసిన వీడియో (Ramakrishna Video) బయటికి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వనమా రాఘవపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Also Read : BREAKING: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కమిషన్
ఇక వనమా రాఘవ అరాచకాలపై ఇప్పుడు స్థానికులు మండిపడుతున్నారు. ఒక కుటుంబం ప్రాణాలను పొట్టనబెట్టుకున్న కాలకేయుడు వనమా రాఘవను వెంటనే ఎన్కౌంటర్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆ కాలకేయుడుని (Kala Kayudu) వెంటనే ఉరి తీయాలని కోరుతున్నారు. కొత్తగూడెం నియోజవర్గంలో వనమా రాఘవ బాధితులు చాలా మంది ఉన్నారంటూ స్థానికులు పేర్కొంటున్నారు. మానవత్వం లేని ఇలాంటి క్రూరుడిపై విడిచిపెట్టకూడదని అంటున్నారు. ఇక వనమా రాఘవను (Vanama Raghava) కొత్తగూడెం మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టడానికి తీసుకెళ్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వనమా రాఘవను ఉరి తీయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం భద్రాచలం ప్రత్యేక సబ్ జైల్లో వనమా రాఘవ ఉన్నారు. బారక్ నెంబర్ 1, రిమాండ్ ఖైదీ నెంబర్ 985 కేటాయించారు.
Also Read : స్టార్ హీరోయిన్‌కి పాజిటివ్.. త్వరగా చచ్చిపో అంటూ నెటిజన్లు ఫైర్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి