Palvancha Family Suicide: ఎమ్మెల్యే వనమా ఫస్ట్ రియాక్షన్.. కొడుకుపై ఆరోపణలపై బహిరంగ లేఖ

MLA Vanama Venkateshwara Rao reaction over Palvancha family suicide: పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పందించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2022, 04:39 PM IST
  • పాల్వంచ ఫ్యామిలీ ఆత్మహత్యపై ఎమ్మెల్యే వనమా స్పందన
  • బహిరంగ లేఖ విడుదల చేసిన ఎమ్మెల్యే వనమా
  • కొడుకును పోలీసులకు అప్పగిస్తానన్న ఎమ్మెల్యే
  • విచారణకు సహకరిస్తానని హామీ
Palvancha Family Suicide: ఎమ్మెల్యే వనమా ఫస్ట్ రియాక్షన్.. కొడుకుపై ఆరోపణలపై బహిరంగ లేఖ

MLA Vanama Venkateshwara Rao reaction over Palvancha family suicide: పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పందించారు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని... తన కుమారుడు వనమా రాఘవను విచారణకు అప్పగించేందుకు సిద్ధమని ప్రకటించారు. పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు తన కుమారుడిని అప్పగిస్తానని తెలిపారు. నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తనను తీవ్ర దిగ్భ్రాంతికి, మనోవేదనకు గురిచేసిందని లేఖలో ఎమ్మెల్యే వనమా పేర్కొన్నారు. రామకృష్ణ సెల్ఫీ వీడియో తనను కలచివేసిందని, క్షోభకు గురిచేసిందని చెప్పారు.  ఈ మేరకు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు వనమా వెంకటేశ్వరరావు బహిరంగ లేఖ విడుదల చేశారు.

నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని లేఖలో ఎమ్మెల్యే వనమా పేర్కొన్నారు. రామకృష్ణ సెల్ఫీ వీడియో తనను కలచివేసిందన్నారు. ఈ ఘటనలో తన కొడుకు వనమా రాఘవపై ఆరోపణలు వచ్చాయని... దానిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని పోలీసులను కోరుతున్నట్లు చెప్పారు. చట్టం, న్యాయంపై తనకు నమ్మకం ఉందని... విచారణకు అన్ని విధాలా సహకరిస్తానని స్పష్టం చేశారు. ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారని తెలిపారు.

ఈ ఘటనలో రాఘవ తన  నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేంతవరకూ నియోజకవర్గ రాజకీయాలకు అతన్ని  దూరంగా ఉంచుతానని ఎమ్మెల్యే వనమా పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు తనతో పాటు టీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న  ఉద్దేశపూర్వక ఆరోపణలను తాను పట్టించుకోనని అన్నారు. 

పాల్వంచ ఘటన నేపథ్యంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రాజీనామాకు ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఘటన జరిగి మూడు రోజులైనా నిందితుడు వనమా రాఘవను (Vanama Raghava) అరెస్ట్ చేయకపోవడమేంటని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి అండదండల కారణంగానే నిందితుడిని అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలతో ఎమ్మెల్యే వనమా ఈ ఘటనపై స్పందించక తప్పలేదు.

పాల్వంచ ఫ్యామిలీ సూసైడ్.. వనమా రాఘవపై ఆరోపణలు

పాల్వంచ పట్టణంలో ఈ నెల 3న నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి, కూతుళ్లు, సాహితీ, సాహిత్యలు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు నాగ రామకృష్ణ రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో తాజాగా వెలుగుచూసింది. ఈ వీడియోలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ వేధింపులను రామకృష్ణ బయపెట్టాడు. ఆస్తి వివాదానికి సంబంధించిన సమస్య పరిష్కారం కోసం అతన్ని ఆశ్రయించగా... తన భార్యను పంపిస్తే సెటిల్ చేస్తానని అసభ్యంగా మాట్లాడినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆర్థిక ఇబ్బందులకు తోడు రాఘవ వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలిపాడు. మరోవైపు, రాఘవ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశాడు. ప్రస్తుతం రాఘవ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also Read: సభ్య సమాజం సిగ్గుపడే ఘటన.. వనమా రాఘవకు కేసీఆర్ అండదండలు..: పాల్వంచ ఘటనపై రేవంత్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News