Medigadda Sinks: మరింత కుంగిన మేడిగడ్డ బ్యారేజీ.. ప్రమాదకరంగా కాళేశ్వరం ప్రాజెక్టు

Once Again Medigadda Sinks And Cracks Developed: గోదావరి నీటిని ఒడిసిపట్టేందుకు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదకరంగా మారింది. ఉగాది పండుగ రోజు మేడిగడ్డ బ్యారేజీ మరింత కుంగింది. దీంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 9, 2024, 04:03 PM IST
Medigadda Sinks: మరింత కుంగిన మేడిగడ్డ బ్యారేజీ.. ప్రమాదకరంగా కాళేశ్వరం ప్రాజెక్టు

Medigadda Sinks: కరువును తరమికొట్టేందుకు కల్పతరువుగా భావించి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదకరంగా మారింది. పగుళ్లు ఏర్పడిన రెండు పిల్లర్లు కూలే స్థితిలో ఉండగా.. తాజాగా అవి మరింత కుంగిపోయాయి. కాళేశ్వరంలోనే ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజ్ రోజురోజుకు కుంగిపోతుంది. గతేడాది కొంత కుంగిన మేడిగడ్డపై తీవ్ర రాజకీయ వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రాజెక్టులో కూలిన పిల్లర్లను పట్టించుకోకుండా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవాలని చూస్తున్నదని బీఆర్‌ఎస్‌ పార్టీ విమర్శిస్తోంది. ఆ విమర్శలకు తగ్గట్టుగానే తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టడం లేదు. దీంతో తాజాగా మరోసారి మేడిగడ్డ బ్యారేజ్‌ కొంత కుంగింది. పగుళ్లు మరింత పెరిగాయి.

Also Read: Revanth Reddy: రేవంత్‌ రెడ్డికి మళ్లీ తప్పిన ప్రమాదం.. నెలలో ఇది రెండోసారి

 

మేడిగడ్డ బ్యారేజ్‌లో మంగళవారం 20వ పిల్లర్ మరింత కుంగిపోయింది. 5 ఫీట్లకు పైగా కుంగడం ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకు పగుళ్లు, కుంగిపోవడం పెరుగుతుండడంతో ప్రాజెక్టుపై నీలిమేఘాలు ఏర్పడ్డాయి. పిల్లర్ మధ్యలో పగుళ్లు మరింత విస్తరిస్తున్నాయి. మట్టికట్ట కింద నుంచి నీళ్లు లీకవుతున్నాయి. 7వ బ్లాక్‌పై ఉన్న 11 పిల్లర్లలోనూ కనిపిస్తున్న కుంగుబాటు ప్రభావం. ప్రాజెక్టు కుంగుబాటు మొదలయినప్పుడే తక్షణమే చర్యలు తీసుకోకపోవడంతో మరింత కుంగుతోంది.

Also Read: BRS MLC K Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం..

 

గత నెల నుంచి ఇప్పటి వరకు 2 ఫీట్లు పైగా 7వ బ్లాక్ కుంగిపోయింది. కుంగిపోవడం పెరిగిపోతుండడంతో బ్యారేజ్‌కు మరమ్మత్తులు అసాధ్యం అంటున్న నిపుణులు. ఇప్పటికే ప్రాజెక్టు కుంగుబాటుపై జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అధికారులు పరిశీలచన చేశారు. నిపుణుల కమిటీ నివేదిక కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. కాగా ఇప్పటికే మేడిగడ్డ అంశం తీవ్ర రాజకీయ వివాదానికి దారి తీసిన విషయం తెలసిందే. బీఆర్‌ఎస్‌ పార్టీ, కాంగ్రెస్‌ మధ్య పోటాపోటీ విమర్శలు, ఆరోపణలు, వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ప్రాజెక్టును మొదట రేవంత్‌ రెడ్డి బృందం పర్యటించగా.. కొన్ని రోజులకు కేటీఆర్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ బృందం పర్యటించింది. ప్రాజెక్టులో కుంగిన ప్రాంతాన్ని మరమ్మతు చేస్తే సరిపోతుందని గులాబీ పార్టీ వాదిస్తోంది. మరమ్మతు చేయకుండా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయేలా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపిస్తోంది. 

ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 'కాళేశ్వరం ప్రాజెక్టు' మరోసారి వివాదాస్పదం కానుంది. కేసీఆర్‌ ప్రభుత్వంపై రేవంత్‌ రెడ్డి విమర్శలు చేసే అవకాశం ఉంది. ఎన్నికలకు కాళేశ్వరం అస్త్రంగా మారనుంది. అయితే మొదటి నుంచి కాళేశ్వరంపై బీఆర్‌ఎస్‌ పార్టీ బలంగా వాదనలు చేస్తోంది. కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ వాస్తవాలు చెబుతోంది. బ్యారేజ్‌ మరింత కుంగుతుండడంతో ఈ వివాదం మరోసారి రాజకీయ రచ్చకు దారి తీయనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News