TS Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..త్వరలో మరో నోటిఫికేషన్..!

TS Jobs: తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. త్వరలో మరో నోటిఫికేషన్ రానుంది. ఇందులో భారీగా పోస్టులను భర్తీ చేయనున్నారు. 

Written by - Alla Swamy | Last Updated : Sep 23, 2022, 02:28 PM IST
  • తెలంగాణలో కొలువుల జాతర
  • త్వరలో మరో నోటిఫికేషన్
  • భారీగా పోస్టుల భర్తీ
TS Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..త్వరలో మరో నోటిఫికేషన్..!

TS Jobs: తెలంగాణలో రెండు రోజుల్లో మరో నోటిఫికేషన్‌ రాబోతోంది. వైద్య శాఖలో పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. 1,140 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ రానుంది. పీహెచ్‌సీల్లో వెయ్యి డాక్టర్ పోస్టులకు పది రోజుల్లో నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్నారు. వీటితోపాటు మరో 140 మంది మిడ్ వైఫరీలు త్వరలో అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఇటీవల వైద్య శాఖలో పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. 

ఈమేరకు నోటిఫికేషన్‌ సిద్ధం చేశామని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. గతంలో ఎన్నడూలేనివిధంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 90 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందులో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని..మరో 10 వేల ఉద్యోగాలను కాంట్రాక్టుగా పనిచేస్తున్న వారిని రెగ్యులరైజేషన్ చేస్తామన్నారు. అప్పటి నుంచి వివిధ శాఖ వరుసగా నోటిఫికేషన్లు రానున్నాయి.

పోలీసు శాఖలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇటీవల కానిస్టేబుల్ పోస్టులకు తొలి రౌండ్‌ రాత పరీక్ష పూర్తైంది. ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్‌ ఉండనుంది. అందులో ఎంపిక అయిన వారికి ఫైనల్ ఎగ్జామ్ ఉండనుంది. ఇందులో ఉత్తీర్ణత పొందిన వారిని ఉద్యోగాల్లో తీసుకోనున్నారు. త్వరలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈమేరకు ఇటీవల అనుమతి సైతం వచ్చినట్లు తెలుస్తోంది. ఈఏడాది చివరిలోపు నోటిఫికేషన్‌ రానుంది.

Also read:Jagan Kuppam Tour: చంద్రబాబు అడ్డ కుప్పం వేదికగా జగన్ వరం.. జనవరి నుంచి పెన్షన్ పెంపు  

Also read:Krishnam Raju Pet: కృష్ణంరాజు మృతితో ఆయన పెంపుడు కుక్క చేసిన పని తెలిస్తే షాక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News