రైతు సమస్వయ సమితుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

రైతన్నలను సంఘటితం చేసేందుకు టి.సర్కార్ నడుంబిగించింది. అన్నదాతలకు అండగా నిలిచే రైతు సమన్వయ సమితులు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఆలోచలనలకు అనుగుణంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి రైతు సమన్వయ సమితుల ఏర్పాటు, ఇందులో సభ్యుల సంఖ్య, ఎంపిక విధానం తదితర అంశాలతో టి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

Last Updated : Aug 28, 2017, 01:06 PM IST
రైతు సమస్వయ సమితుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: రైతన్నలను సంఘటితం చేసేందుకు టి.సర్కార్ నడుంబిగించింది. అన్నదాతలకు అండగా నిలిచే రైతు సమన్వయ సమితులు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఆలోచలనలకు అనుగుణంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి రైతు సమన్వయ సమితుల ఏర్పాటు, ఇందులో సభ్యుల సంఖ్య, ఎంపిక విధానం తదితర అంశాలతో టి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

స్వరూపం.. ఎంపిక విధానం

తాజా జీవోను అనుసరించి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్టాయి వరకు  రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తారు. ప్రతి స్థాయి సమితికి ఒక సమన్వయ కర్తతో పాటు సభ్యులు ఉంటారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి సమన్వయ సమితి ఏర్పాటు బాధ్యత  ఇన్ ఛార్జ్ మంత్రులకు అప్పగించారు. సమన్వయకర్తతో పాటు సభ్యుల ఎంపిక నామినేడెడ్ పద్దతిలో ఖరారు చేస్తారు . అలాగే రాష్ట్ర స్థాయి సమన్వయ సమితి ఏర్పాటు బాధ్యత సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో జరుగుతుంది. సెప్టెంబర్ 9 లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సమితుల వల్ల ప్రయోజనం ఏంటి ?

రైతన్నలను సంఘటితం చేయడంలో ఈ సమితులు కీలక పాత్ర పోషించనున్నాయి. రైతు ఆత్మహత్యలను నివారించేందుకు గాను, రైతు గిట్టుబాటు ధరతో పాటు పలు సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు గాను ఈ సమన్వయ సమితులు పనిచేయనున్నాయి. రైతు సమన్వయ సమితి వద్ద రూ.500 కోట్ల మూల నిధి ఏర్పాటు చేయనున్నారు. కనీస మద్దతు ధర, ఇరత సమస్యలు ఏర్పడినపుడు ఈ నిధులను రైతు సమన్వయ సమితి వినియోగించుకునే వీలు కల్పించారు.
 

Trending News