Non-Agricultural Property registration slot bookings start: హైదరాబాద్: తెలంగాణలో వ్యవసాయేతర (Non-Agricultural properties registration) ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం నుంచి రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగనుంది. మధ్యవర్తులు, అధికారుల ప్రమేయం లేకుండా ఒకేసారి ఆన్‌లైన్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ( properties registration ) ను పారదర్శకంగా నిర్వహించేలా ప్రభుత్వం ( TS Govt ) చర్యలు తీసుకుంది.
ఈ ఆన్‌లైన్ ప్రక్రియను ( Telangana ) ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ (CS Somesh kumar) శుక్రవారం శుక్రవారం బీఆర్కే భవన్‌లో పరిశీలించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత పద్ధతిలోనే స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ వెబ్‌సైట్ ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని తెలిపారు. వ్యవసాయభూముల మాదిరిగానే వ్యవసాయేతర ఆస్తులకు సైతం రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఒకేచోట పూర్తవుతుందన్నారు. రద్దీని బట్టి స్లాట్ బుకింగ్ (slot bookings ) లను పెంచుతామని సోమేష్ కుమార్ తెలిపారు. Also read: Dharani Portal: నాన్-అగ్రికల్చరల్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్‌కి రైట్ రైట్
ఇదిలాఉంటే.. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైన మొదటిరోజునే ప్రభుత్వానికి రూ.85 లక్షల ఆదాయం వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రక్రియను ప్రారంభించగా.. 15 నిమిషాల్లోనే రెండుస్లాట్లు బుక్ అయ్యాయి. రాత్రి 7 గంటలవరకు 37 స్లాట్లు బుక్ అయ్యాయి. అయితే సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, ఉద్యోగులకు రెండో శనివారం, ఆదివారం సెలవులను రద్దు చేశారు. ఈ రెండు రోజులు తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్ శాఖ సీఐజీ శేషాద్రి ఉత్తర్వులు జారీచేశారు. Also read: Farmer protests: 17వ రోజుకు రైతుల ఉద్యమం.. నేడు రహదారుల దిగ్బంధం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook