Nizamabad Rowdy Gang: నిజామాబాద్‌లో రెచ్చిపోయిన రౌడీ గ్యాంగ్.. స్థానికుల్లో దడ పుట్టించిన సంఘటన

Nizamabad Rowdy Sheeter attacks a Man: నిజామాబాద్‌లో రౌడీ గ్యాంగ్ హల్‌చల్ స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఓ టీ స్టాల్‌పై దాడి చేసిన ఆ గ్యాంగ్.. ఓ వ్యక్తిని బయటకు లాక్కొచ్చి విచక్షణారహితంగా కొట్టారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 16, 2022, 01:57 PM IST
  • నిజామాబాద్ ఆటోనగర్‌లో రౌడీ గ్యాంగ్ హల్‌చల్
  • టీ స్టాల్‌పై దాడి చేసిన జంగిల్ హిబ్బు గ్యాంగ్
  • కర్రలు, రాడ్లతో ఓ వ్యక్తిపై దాడి
  • సోషల్ మీడియాలో వైరల్‌గా దాడి వీడియోలు
 Nizamabad Rowdy Gang: నిజామాబాద్‌లో రెచ్చిపోయిన రౌడీ గ్యాంగ్.. స్థానికుల్లో దడ పుట్టించిన సంఘటన

Nizamabad Rowdy Sheeter attacks a Man: నిజామాబాద్‌ శివారులోని ఆటోనగర్‌లో ఓ రౌడీ మూక రెచ్చిపోయింది. స్థానికంగా ఉన్న రజాక్ టీ స్టాల్‌పై దాడికి పాల్పడింది. టీ స్టాల్‌పై రాళ్లు రువ్వడంతో పాటు కర్రలు, ఇనుపరాడ్లతో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. టీ స్టాల్ లోపలి నుంచి ఓ వ్యక్తిని బయటకు లాక్కొచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. అతనిపై పిడిగుద్దులు కురిపించారు. అంతా చూస్తుండగానే రౌడీ మూక ఇలా దాడులకు తెగబడటం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. మంగళవారం (ఫిబ్రవరి 15) సాయంత్రం ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.

పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లుగా చెబుతున్నారు. స్థానిక రౌడీ షీటర్, పీడీ యాక్ట్ నిందితుడు జంగిల్ హిబ్బు, అతని అనుచరులు కలిసి ఈ దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. ఇర్ఫాన్ ఖాన్, ఇల్లియాస్ అనే ఇద్దరు వ్యక్తులతో హిబ్బుకు కొంతకాలంగా విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం ఈ ఇద్దరు రజాక్ టీ స్టాల్‌లో టీ తాగుతుండగా హిబ్బు గ్యాంగ్ అక్కడికి చేరుకుని దాడికి పాల్పడినట్లు సమాచారం. 

ఇర్ఫాన్, ఇల్లియాస్ ఫిర్యాదు మేరకు నిజామాబాద్ ఆరో టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. దాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో ఇదే నిజామాబాద్‌లో ఆరిఫ్ అనే రౌడీ షీటర్ గన్‌తో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాక.. నగర శివారులోని ఓ ఫాంహౌస్‌లో నిర్వహించిన బర్త్ డే వేడుకల్లో ఆరిఫ్ గాల్లోకి మౌడు రౌండ్లు కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది. 

Also Read: Revanth Reddy Arrest: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హౌస్ అరెస్టు.. భారీగా పోలీసులు మోహరింపు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News