New Ration Cards in Telangana: అక్టోబర్ లో కొత్త రేషన్ కార్డులు.. ఇలా అప్లయ్ చేసుకోండి..

New Ration Cards in Telangana: మరో రెండు నెలలు గడిస్తే తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి  యేడాది పూర్తవుతుంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి కొత్త  రేషన్ కార్డులు ఇస్తానని చెప్పుకొచ్చారు. తాజాగా కొత్త రేషన్ కార్డులు కావాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్.  

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 17, 2024, 10:53 AM IST
 New Ration Cards in Telangana: అక్టోబర్ లో కొత్త రేషన్ కార్డులు.. ఇలా అప్లయ్ చేసుకోండి..

New Ration Cards in Telangana: రేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న వాటినే కొనసాగించింది. కానీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏదో కొన్ని చోట్ల మాత్రం ఇచ్చామంటూ కొన్ని రేషన్ కార్డులను ఇష్యూ చేశారు. ఆ తర్వాత కొత్త పెళ్లైన వాళ్లకు మాత్రం అసలు రేషన్ కార్డులు ఇష్యూ చేయలేదు.

తాజాగా అక్టోబర్ లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్, హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది రేవంత్ రెడ్డి సర్కారు. ఇవాళ జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భేటీ అనంతరం  మంత్రి ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించారు.

కొత్త రేషన్ కార్డు విధివిధానాలు రూపొందిస్తున్నామని చెప్పారు మంత్రి ఉత్తమ్. తెల్ల రేషన్ కార్డు అర్హులు ఎవరనేదానిపై వచ్చే భేటీలో నిర్ణయిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డులు ఎలా ఇస్తున్నారనేదానిపై  అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డుల నిబంధనలు ఎలా  ఉండాలని పార్టీలకు  లేఖ రాశామన్నారు. కొంత మంది ప్రజాప్రతినిధులు విలువైన సూచనలు చేశారు.

అలా వచ్చిన సూచనలన్నీ సమావేశంలో చర్చించామని తెలిపారు. సెప్టెంబర్ 21 న మరోసారి కేబినెట్ సబ్ కమిటీ భేటీ ఉంటుందన్నారు. ఈ నెలాఖరులోగా కేబినెట్  కమిటి రిపోర్ట్ ఇస్తుందని తెలిపారు. అక్టోబర్ లో అర్హులైన అందరికీ  కొత్త రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు మంత్రులు.

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News