Sumedha death issue: సుమేధ మృతికి కారకులు ఎవరు ? ఆ పాపం ఎవరిది ? కట్టలుతెంచుకున్న నేరేడ్‌మెట్ వాసుల ఆగ్రహం

నేరేడ్‌మెట్‌లో సుమేధ అనే 12 ఏళ్ల బాలిక నాలాలో ( Sumedha found dead in Nala ) పడి మృతి చెందిన ఘటన అక్కడి కాలనీ వాసుల్లో తీవ్ర ఆందోళనరేకెత్తిస్తోంది. మరీ ముఖ్యంగా దీన్‌దయాల్ నగర్, సంతోషి మాత కాలనీ, కాకతీయ నగర్ కాలనీ వాసుల ఆందోళన మునుపటికంటే మరింత రెట్టింపైంది.

Last Updated : Sep 19, 2020, 07:21 PM IST
  • హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లో సైకిల్ తొక్కుతూ వెళ్లి ఓపెన్ నాలాలో పడి మృతి చెందిన 12 ఏళ్ల బాలిక సుమేధ
  • సుమేధ మృతితో ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరిపై నేరేడ్‌మెట్ వాసుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం
  • ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లకోసం కాలనీల్లో నిస్సిగ్గుగా పర్యటించి ఓట్లు అడుక్కునే ప్రజాప్రతినిధులు.. కాలనీల్లో సమస్యలను మాత్రం పరిష్కరించకుండా తప్పించుకు తిరుగుతున్నారని మండిపాటు
Sumedha death issue: సుమేధ మృతికి కారకులు ఎవరు ? ఆ పాపం ఎవరిది ? కట్టలుతెంచుకున్న నేరేడ్‌మెట్ వాసుల ఆగ్రహం

హైదరాబాద్: నేరేడ్‌మెట్‌లో సుమేధ అనే 12 ఏళ్ల బాలిక నాలాలో ( Sumedha found dead in Nala ) పడి మృతి చెందిన ఘటన అక్కడి కాలనీ వాసుల్లో తీవ్ర ఆందోళనరేకెత్తిస్తోంది. మరీ ముఖ్యంగా దీన్‌దయాల్ నగర్, సంతోషి మాత కాలనీ, కాకతీయ నగర్ కాలనీ వాసుల ఆందోళన మునుపటికంటే మరింత రెట్టింపైంది. ఎందుకంటే ఈ మూడు కాలనీల ప్రాంతాల్లో పొంగి ప్రవహిస్తున్న నాలాలన్నీ ఓపెన్ నాలాలే ( Open Nalas ) కావడమే వారి ఆందోళనకు కారణమైంది. నాలాల్లో పూడికతీత తీయకపోవడంతో కొద్దిపాటి వర్షం పడినా అవి పొంగి ప్రవహిస్తుండటం.. మరోవైపు రోడ్లంతా బురదమయమై నడిచేందుకు మార్గం లేకపోవడంతో.. ప్రమాదం అని తెలిసి కూడా ఆ నాలాల పక్క నుంచే నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి ఇక్కడి ప్రాంతాల వారిది. కొద్దిపాటి వర్షాలకే పరిస్థితి ఇలా ఉంటే ఇక భారీ వర్షాలు ( Heavy rain in Hyderabad ) కురిసిన ప్రతీసారి పరిస్థితి ఇంకెంత భయంకరంగా ఉంటుందో మాటల్లో చెప్పడం కష్టమే అంటున్నారు అక్కడి స్థానికులు. Also read : MLA seethakka arrest: ఎమ్మెల్యే సీతక్క అరెస్ట్.. ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత!

నేరేడ్ మెట్ నాలాలో పడి మృతి చెందిన సుమేధ ఘటన నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి రంగంలోకి దిగిన స్థానిక నాయకులు, అధికారులు......

Posted by Zee Hindustan Telugu on Saturday, September 19, 2020

 

రోడ్డు పక్కనే ఓపెన్ నాలా ఉందని తెలియనివారు వచ్చి తమ వాహనాలతో సహా నాలాల్లో పడిపోతున్నారని.. గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందని.. ఇది తమ ప్రాంతం పరిధిలోకి రాదంటే.. తమ ప్రాంతం పరిధిలోకి రాదంటూ స్థానిక కార్పొరేటర్లు చేతులు దులిపేసుకోవడం అత్యంత దారుణం అని నేరేడ్‌మెట్ వాసులు స్థానిక ప్రజాప్రతినిధులు, మల్కాజిగిరి ఎమ్మెల్యే హన్మంత రావు ( Malkajigir MLA Hanmantha Rao ), జీహెచ్ఎంసీ అధికారుల ( GHMC officials ) వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కార్పోరేటర్లు వేరైనా.. ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే మాత్రం ఒక్కరే కనుక కనీసం ఆయనైనా తమ సమస్యను పరిష్కరించాలని నేరెడ్‌మెట్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. Also read : Pragathi Bhavan: ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఓవైపు సుమేధ లాంటి చిన్నారులను కోల్పోయిన ఆవేదనలో మేముంటే.. ప్రజాప్రతినిధులు వచ్చి వచ్చే ఏడాది పూర్తి చేస్తామంటున్నారని.. ఆలోగా ఇంకెంత మంది సుమేధలు చావాలని స్థానికులు ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. వచ్చే ఏడాది అని కాలయాపన చేయకుండా వెంటనే నాలాల అభివృద్ధి పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తున్నారు. Also read : New Revenue Act 2020: కొత్త రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఆమోదం.. రిజిస్ట్రేషన్ పని ఇక వారిదే

నగరంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు నేరేడ్‌మెట్‌లోని నాలాలు పొంగి ప్రవహిస్తున్నాయి. జనావాసాల మధ్యే భయంకరమైన ఓపెన్ నాలాలు ఉన్నాయి. నాలాలకు ఇరువైపుల ఎత్తైన గోడలు కానీ లేదా కనీసం మెష్ కూడా ఏర్పాటు చేయలేదు. తమ ఇళ్లలోనూ చిన్న పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటికి వెళ్లిన వారు క్షేమంగా ఇంటికి తిరిగొస్తారనే గ్యారెంటీ కనిపించడం లేదని నేరెడ్‌మెట్ వాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. Also read : Moosapet Metro Station: మెట్రో గోడలకు పగుళ్లు.. హైదరాబాద్ మెట్రో సురక్షితమేనా? 

వాస్తవానికి ఇది ఒక్క నేరేడ్‌మెట్ వాసుల ఒక్కరి దుస్థితి మాత్రమే కాదు.. నగరం నలుమూలలా సుమేధా లాంటి చిన్నారులు, పెద్దలు ఎంతో మంది ఓపెన్ నాలలో పడి మృతి చెందిన సందర్భాలున్నాయి. ఇకనైనా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం, అధికార యంత్రాంగం తేరుకుని ఓపెన్ నాలాలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. Also read : Revanth Reddy's open letter: సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖతో ఎంపీ రేవంత్ రెడ్డి హెచ్చరిక

Trending News