Bank Fraud in Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఎస్‌బీఐలో భారీ గోల్‌మాల్ జరిగింది. బ్యాంకు సిబ్బంది రూ.5 కోట్లు మాయం చేశారు. నిధుల గోల్‌మాల్‌కి సంబంధించి ఇప్పటికే ఓ అధికారిపై వేటు పడినట్లు తెలుస్తోంది. బ్యాంకు ఉన్నతాధికారులు ఇటీవల ఓ బృందాన్ని పంపి అక్కడ ఆడిటింగ్ నిర్వహించడంతో గోల్‌మాల్ బయటపడినట్లు సమాచారం.
బ్యాంకులో నిధుల గోల్‌మాల్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెల 21న ప్రత్యేక టీమ్‌ను పంపి ఆడిట్ చేయించారు. మరుసటి రోజు బ్యాంకు, ఏటీఎంలలో అన్ని లావాదేవీలను నిలిపివేసి ఆడిట్ నిర్వహించారు. ఈ ఆడిట్‌లో రూ.5 కోట్ల 20 లక్షల డబ్బు లెక్క తేలలేదు. దీంతో ఈ డబ్బును ఉద్యోగులే గోల్‌మాల్ చేశారని ఆడిట్ టీమ్ అనుమానిస్తోంది.బ్యాంకులో రుణాల కోసం తనఖా పెట్టిన బంగారు నగలను ఇంకా పరిశీలించాల్సి ఉంది.
నిధుల గోల్‌మాల్‌కి సంబంధించి ఇప్పటికే ఓ అధికారిపై వేటు పడినట్లు తెలుస్తోంది. దీనిపై ఓ దర్యాప్తు సంస్థతో పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన బ్యాంక్ మేనేజర్ నర్సయ్య.. తనకేమీ తెలియదని చెప్పడం గమనార్హం. బ్యాంకులో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఆడిట్ నిర్వహించారని.. అయితే ఆ వివరాలేవీ తనకు తెలియరాలేదని చెప్పారు.
Also Read:PV JAYANTHI: పీవీని కేసీఆర్ వాడుకుని వదిలేశారా! జయంతి వేడుకలకు ఎందుకు హాజరుకాలేదు?
Also Read:TS Inter Supplementary Exams: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటినుంచి అంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.