Hyderabad Press Club Elections Results 2022: హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఎన్నికల ఫలితాలపై నాంపల్లి సిటీ సివిల్ కోర్టుస్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేదాకా ఫలితాలు నిలిపివేయాలని ఆదేశించింది. ప్రెస్‌క్లబ్ ఎన్నికల్లో నిబంధనలు పాటించలేదని కోర్టు అభిప్రాయపడింది. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా వివాదాలకు కారణమయ్యాయి. పోలింగ్ పత్రాలపై స్వస్తిక్ గుర్తుతో పాటు రౌండ్ సీల్ కూడా కనిపించడంతో పలువురు పోటీదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈనెల 13వ తేదీన హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మూడు ప్యానెళ్లు తలపడ్డాయి. మన ప్యానెల్, ఫ్రెండ్స్ ప్యానెల్, ఇండిపెండెంట్ ప్యానెళ్లు తమ తమ అభ్యర్థులను పోటీలో నిలిపాయి.
సాధారణ ఎన్నికలను తలదన్నేలా హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో దాదాపు 1200 మంది సభ్యులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ కొనసాగింది. ఇక, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠగా కొనసాగింది. అర్థరాత్రి దాకా అన్ని పదవులకు సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడగా.. చివరగా అధ్యక్ష పదవికి సంబంధించిన ఓట్ల లెక్కింపు విషయంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
ఫ్రెండ్స్ ప్యానెల్ అభ్యర్థి వేణుగోపాల నాయుడుకు ఎక్కువ ఓట్లు వచ్చాయని తేలింది. అయితే, మన ప్యానెల్ అధ్యక్ష అభ్యర్థి సూరజ్ భరద్వాజ్ పోలింగ్ స్లిప్‌లకు సంబంధించి పలు అభ్యంతరాలు లేవనెత్తారు. పోలైన ఓట్లలో కొన్నింటిలో స్వస్తిక్ గుర్తు ఉండగా.. మరికొన్ని బ్యాలట్ పేపర్లపై రౌండ్ సీల్ కనిపించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఎన్నికల అధికారులను డిమాండ్ చేశారు. ఆ సమయంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో, ఎన్నికల అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బ్యాలెట్ బాక్సులను పోలీసుల పర్యవేక్షణలో భద్రపరిచారు. ఎన్నికల ఫలితాలను నిలిపివేశారు. అయితే, మరుసటిరోజు ఫ్రెండ్స్ ప్యానల్ అధ్యక్ష అభ్యర్థి సూరజ్ భరద్వాజ్‌పై ఎన్నికల అధికారి హేమసుందర్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.
అయితే, తాజాగా ఈ వివాదం మరో మలుపు తిరిగింది. విషయం న్యాయస్థానానికెక్కింది. ఎన్నికలు రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న నాంపల్లి సిటీ సివిల్ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వెలువడే దాకా ప్రెస్‌క్లబ్ కార్యవర్గం ఎన్నికల ఫలితాలను ప్రకటించొద్దని ఆదేశించింది. అయితే, ప్రెస్‌క్లబ్ ఎన్నికల్లో నిబంధనలు పాటించలేదని పిటిషనర్ వాదనలు వినిపించారు. బ్యాలెట్ పత్రాలపై స్వస్తిక్ గుర్తుతో పాటు.. మరో గుర్తు కూడా ఉందని ఆ గుర్తును పరిగణనలోకి తీసుకోవద్దని కోర్టును కోరారు. దీనిపై స్టే విధించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఏప్రిల్ 6వ తేదీకి వాయిదా వేసింది.
Also read : RRR Movie Ticket Price: ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. ఆ సినిమా టికెట్ రేట్స్ పెంపునకు అనుమతి
Also read : Mahesh Babu New Look: సెకండ్ సింగిల్‌కు ముహుర్తం ఫిక్స్.. ఇయర్‌బడ్స్ పగిలిపోయడం ఖాయం! మహేష్ లుక్ అదిరిపోలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook