Nagarjuna Sagar Bypoll Result: నాగార్జునసాగర్‌లో అధికార పార్టీదే విజయం, 18 వేల మెజార్టీ సాధించిన భగత్

Nagarjuna Sagar Bypoll Result: తెలంగాణలో జరిగిన ఉపఎన్నికలో అధికార పార్టీ విజయం సాధించింది. దివంగత నోముల నర్శింహయ్య కుమారుడు నోముల భగత్..విజయంతో మరోసారి గులాబీ జెండా ఎగిరింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 2, 2021, 03:46 PM IST
Nagarjuna Sagar Bypoll Result: నాగార్జునసాగర్‌లో అధికార పార్టీదే విజయం, 18 వేల మెజార్టీ సాధించిన భగత్

Nagarjuna Sagar Bypoll Result: తెలంగాణలో జరిగిన ఉపఎన్నికలో అధికార పార్టీ విజయం సాధించింది. దివంగత నోముల నర్శింహయ్య కుమారుడు నోముల భగత్..విజయంతో మరోసారి గులాబీ జెండా ఎగిరింది.

తెలంగాణ(Telangana)లోని నాగార్జునసాగర్ అసెంబ్లీ (Nagarjuna saga Bypoll) స్థానానికి జరిగిన ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పట్టు సాధించింది. నోముల నర్శింహయ్య అకాల మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఏప్రిల్ 17వ తేదీన జరిగిన ఉపఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఇవాళ జరిగింది. కౌంటింగ్ ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచే టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ ( Nomula Bhagat) స్పష్టమైన మెజార్టీ కనబరిచారు. చివరికి 18 వేల 449 ఓట్ల భారీ మెజార్టీతో సమీప కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డి ( Janareddy)పై విజయం సాధించారు.

కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డి 10, 11, 14 రౌండ్లలో మాత్రం ఆధిక్యం కనబరిచారు. నాగార్జునసాగర్ నుంచి పోటీ చేసిన బీజేపీ (BJP) అభ్యర్ధి రవి నాయక్ డిపాజిట్ గల్లంతైంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎంతగా విమర్శలు ఎక్కుపెట్టినా ఓటర్లు మాత్రం అధికారపార్టీకే పట్టం కట్టారు. మూడు దశాబ్దాలుగా గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధిని..టీఆర్ఎస్ ప్రభుత్వం నాగార్జున సాగర్‌లో చేసి చూపెట్టిందని టీఆర్ఎస్ శ్రేణులు చేసిన ప్రచారానికి ఫలితం దక్కింది. నియోజకవర్గంలో చివర ఎకరాకు సైతం నీళ్లు అందేలా పలు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల్లో విశ్వాసం నెలకొల్పారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్ఎస్‌ను ( TRS Victory) నాగార్జున సాగర్ ప్రజలు మరోసారి ఆదరించారు. 

Also read: Nagarjuna Sagar By Poll: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో TRS ఆధిక్యం, రౌండ్ల వారీగా ఓట్ల వివరాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News