Munugode Byelection: మునుగోడు కాంగ్రెస్ లో టికెట్ లొల్లి.. రేవంత్ రెడ్డి ఛాయిస్ ఎవరో?

Munugode Byelection: మునుగోడు కాంగ్రెస్ లో టికెట్ లొల్లి తీవ్రంగా ఉంది. మునుగోడు నుంచి పాల్వాయి స్రవంతితో పాటు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఇటీవలే పార్టీలో చేరిన చెరకు సుధాకర్ గౌడ్ ,  జర్నలిస్ట్ సంఘం నేత పల్లె రవికుమార్ గౌడ్ స ఉస్మానియా ఉద్యమకారుడు పున్న కైలాస్ నేతతో పాటు బడా కాంట్రాక్టర్ చల్లమల్లా కృష్ణారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.

Written by - Srisailam | Last Updated : Aug 10, 2022, 05:37 PM IST
  • మునుగోడు కాంగ్రెస్ లో టికెట్ వార్
  • రేసులో ముందున్న చల్లమల్లా కృష్ణారెడ్డి
  • కృష్ణారెడ్డి ఎలా ఇస్తారంటున్న స్రవంతి
Munugode Byelection: మునుగోడు కాంగ్రెస్ లో టికెట్ లొల్లి.. రేవంత్ రెడ్డి ఛాయిస్ ఎవరో?

Munugode Byelection:  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు అసెంబ్లీకి త్వరలోనే ఉప ఎన్నిక రానుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు నవంబర్, డిసెంబర్ లో ఉప ఎన్నిక వస్తుందనే ప్రచారం సాగుతుండగా.. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. సెప్టెంబర్, అక్టోబర్ లోనే మునుగోడు ఉప ఎన్నిక జరుగుతుందని చెప్పారు. సెప్టెంబర్ చివర లేదా అక్టోబర్ మొదటి వారంలో దేశంలోని ఖాళీగా ఉన్న కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. మునుగోడు ఉప ఎన్నికను వీలైనంత త్వరగా జరపాలని చూస్తున్న బీజేపీ హైకమాండ్.. వాటితో పాటు బైపోల్ వచ్చేలా ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. రెండు నెలల్లోనే ఉప ఎన్నిక జరగనుండటంతో అన్ని పార్టీలు మునుగోడుపై ఫోకస్ చేశాయి. తమ సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ అన్ని అస్త్రాలను బయిటికి తీస్తోంది. పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ గాంధీభవన్ లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పీసీసీ ముఖ్య నేతలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడుతున్నారు. మునుగోడు టికెట్ ఆశిస్తున్న నేతలతోనూ ఠాకూర్ మాట్లాడారు.

గాంధీభవన్ లో పార్టీ ముఖ్యనేతలు మునుగోడు ఉప ఎన్నికపై చర్చిస్తుండగానే ఓ ఆడియా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి.. ఓ కాంగ్రెస్ నేతతో మాట్లాడిన ఆడియో లీకైంది.  అభ్యర్థి ఎంపిక విషయంలో  కీలక వ్యాఖ్యలు చేశారు పాల్వాయి స్రవంతి. మునుగోడు టికెట్ రేసులోకి వచ్చిన చలమల్ల కృష్ణారెడ్డి టికెట్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. చండూరు సభ తన వల్లే సక్సెస్ అయ్యిందంటూ కార్యకర్తలకు ఫోన్ చేశారు. ముక్కు,మొఖం తెలియని కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మునుగోడులో ఓడిపోవాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. రేవంత్ పరువు నిలబెట్టుకోవాలంటే గెలిచే వారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు పాల్వాయి స్రవంతి. సొంత ఊరి ప్రజలకు కూడా తెలియని కృష్ణారెడ్డి ఎలా తెరపైకి తీసుకువస్తారంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఘాటుగా మాట్లాడారు పాల్వాయి స్రవంతి. కాంగ్రెస్ నాయకుడితో పాల్వాయి స్రవంతి మాట్లాడిన మాటలు కాక రాజేస్తున్నాయి.

మునుగోడు కాంగ్రెస్ లో టికెట్ లొల్లి తీవ్రంగా ఉంది. మునుగోడు నుంచి పాల్వాయి స్రవంతితో పాటు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఇటీవలే పార్టీలో చేరిన చెరకు సుధాకర్ గౌడ్ ,  జర్నలిస్ట్ సంఘం నేత పల్లె రవికుమార్ గౌడ్ స ఉస్మానియా ఉద్యమకారుడు పున్న కైలాస్ నేతతో పాటు బడా కాంట్రాక్టర్ చల్లమల్లా కృష్ణారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కృష్ణారెడ్డి ఇటీవలే తెరపైకి వచ్చాయి. సంస్థాన్ నారాయణ పురం మండలాని చెందిన కృష్ణారెడ్డి హైదరాబాద్ లో స్థిరపడ్డారు. బిల్డర్, కాంట్రాక్టర్ గా ఆయనకు భారీగా ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు అధికార పార్టీని ఎదుర్కొవాలంటే ఆర్థికంగా సంపన్నుడు కావాలనే ఉద్దేశంతో చల్లమల్లా కృష్ణారెడ్డిని మునుగోడులో రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకువచ్చారని తెలుస్తోంది.

ఉప ఎన్నికలో తనకు టికెట్ ఇస్తే వంద కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తానని కృష్ణారెడ్డి చెబుతున్నారని సమాచారం. ఇటీవల చండూరులో నిర్వహించిన సభ ఖర్చులు కూడా ఆయనే భరించారట. ఉప ఎన్నికలో ఎంతైనా ఖర్చు పెడతానని.. కాని ఉప ఎన్నికలో ఓడిపోయినా తనకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని పీసీసీ పెద్దలకు కృష్ణారెడ్డి కండీషన్ పెట్టారని తెలుస్తోంది. ఇందుకు రేవంత్ రెడ్డి కూడా ఓకే చెప్పడంతో నియోజకవర్గంలో తిరుగుతున్నారని అంటున్నారు. ఆర్థికంగా బలవంతుడు కావడంతో కాంగ్రెస్ కేడర్ కూడా ఆయనకు మద్దతు ఇస్తుందని తెలుస్తోంది. కృష్ణారెడ్డి రేసులో ముందు ఉండటంతో తనకు టికెట్ రాదేమోనన్న భయంతోనే పాల్వాయి స్రవంతి అతన్ని టార్గెట్ చేసిందని తెలుస్తోంది. పాల్వాయి స్రవంతి 2014 ఎన్నికల్లో మునుగోడులో ఇండిపెండెంట్ గా పోటీ చేసి 27 వేల ఓట్లు సాధించారు. పొత్తుల్లోభాగంగా మునుగోడును సీపీఐకి కేటాయించడంతో స్రవంతి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇక 2018 ఎన్నికల్లో మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టికెట్ ఇచ్చినా స్రవంతి సహకరించారని చెబుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News