Dengue cases in Hyderabad: హైదరాబాద్‌లో పెరుగుతున్న డెంగ్యూ కేసులు

Dengue cases in Hyderabad: హైదరాబాద్: కరోనా పాజిటివ్ కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న తరుణంలోనే గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో డెంగ్యూ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వర్షాకాలం వర్షాలతో (Rains) జనావాసాల మధ్య అక్కడక్కడ నీరు నిలుస్తుండటంతో దోమల (mosquitos) బెడద పెరుగుతోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 8, 2021, 09:05 PM IST
Dengue cases in Hyderabad: హైదరాబాద్‌లో పెరుగుతున్న డెంగ్యూ కేసులు

Dengue cases in Hyderabad: హైదరాబాద్: కరోనా పాజిటివ్ కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న తరుణంలోనే గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో డెంగ్యూ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వర్షాకాలం వర్షాలతో (Rains) జనావాసాల మధ్య అక్కడక్కడ నీరు నిలుస్తుండటంతో దోమల (mosquitos) బెడద పెరిగి డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయని గుడిమల్కాపూర్‌కి చెందిన డా. మనబెంద్ర ఘోష్ పేర్కొన్నట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం వెల్లడించింది. 

వర్షాకాలం రాకతో డెంగ్యూ, చికుంగున్యా , మలేరియా వ్యాప్తికి కారణమయ్యే దోమల బెడద పెరుగుతోంది. ఫలితంగా వ్యాధుల సంఖ్య పెరగడం మొదలైంది. ఈ వ్యాధులకు తోడు టైపాయిడ్, కొవిడ్-19 (COVID-19) ఎలాగూ ఉండనే ఉన్నాయి. ఇంకొన్ని సందర్భాల్లో ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ ఇన్‌ఫెక్షన్స్ (Infections) రోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని, ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేస్తే కానీ ఆ ఇన్‌ఫెక్షన్స్ ఏంటనేది గుర్తించే వీలు లేదని ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డా ఆశిష్ చౌహన్ అభిప్రాయపడినట్టుగా సదరు వార్తా కథనం పేర్కొంది. 

Also read: Health benefits of eating almonds: రోజుకు రెండుసార్లు బాదం తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

లాక్‌డౌన్ (Lockdown) ఎత్తేసిన అనంతరం బయట జనం రద్దీ విపరీతంగా పెరగడం కూడా డెంగ్యూ, టైపాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు (Seasonal diseases) కేసులు పెరగడానకి మరో కారణం అని మరో వైద్యుడు అభిప్రాయపడ్డారు. 

తమ వద్దకు వచ్చే కేసులను పరిశీలిస్తే.. లో ప్లేట్‌లెట్‌ కౌంట్, గాల్ బ్లాడర్ ఇన్‌ఫెక్షన్స్ (low platelet count, gall bladder infection) సైతం పెరుగుతున్నట్టు అర్థమవుతుందని వైద్యలు చెబుతున్నారు. రానున్న మరికొద్ది వారాల్లో డెంగ్యూతో పాటు ఇతర ఇన్ ఫెక్షన్స్ కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్న వైద్యులు.. దోమ కాటు నివారణ చర్యలు (mosquitos bites) చేపట్టకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. 

Also read : AP Corona Update: ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా వైరస్ కేసులు

అంతేకాకుండా దోమలకు ఆవాసంగా మారే (mosquito breeding sites) నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి సంబంధిత ఎంటమాలజీ విభాగం అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యులు సూచిస్తున్నారు.

Also read : Bone Death Issue: పోస్ట్ కోవిడ్‌లో మరో సమస్య, కొత్తగా బోన్ డెత్‌ను గుర్తించిన వైద్యులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News