హైదరాబాద్: పసుపు మార్కెటింగ్ లో కేంద్రం విఫలమైందని, ఔషధ లక్షణాలున్న పసుపును ప్రపంచవ్యాప్తం చేయకపోవడం కేంద్ర అసమర్థతకు నిదర్శనమని పసుపు రైతులకు మద్దతు ధర లేదని, మండిపడ్డారు. కేరళలోని అలెప్పీ పసుపుకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండగా, ఇక్కడి రైతులకు అందించి సాగులో మెళకువలు అందించడం జరిగిందని అన్నారు.
Read Also: Sensex: భారత స్టాక్ మార్కెట్లకు కరోనా దెబ్బ
కేంద్రం నాణ్యతను పెంచడంతో పాటు, ఎగుమతుల మీద దృష్టి సారించాలని, కాగా ప్రభుత్వమే పసుపును తీసుకుని ప్రాసెసింగ్ చేసే అవకాశాల మీద దృష్టి సారించాలని కేంద్రాన్ని సూచించారు. పసుపులో కల్తీని పూర్థిస్థాయిలో అరికట్టాలని పీపీపీ మోడల్ లో పసుపు ప్రాసెసింగ్, మార్కెటింగ్ అంశాలపై దృష్టి సారించాలని కోరారు.
Read Also: కేంద్రాన్ని నమ్ముకుంటే అంతే సంగతులు..!!
కాగా మహిళా సంఘాలకు ప్రయోగాత్మకంగా పసుపును అప్పగించాలని, నాణ్యమైన పసుపు వంగడాలు ఇచ్చి దిగుబడి పెరిగేలా చూస్తే ప్రయోజనకరంగా ఉంటుందనిఅన్నారు. నిపుణుల కమిటీ వేసి పసుపు వినియోగం అవకాశాలను పరిశీలించాలని సీఎం కేసీఆర్ సమీక్షలో సూచించారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..