MLC Kavitha: ఎంపీ అరవింద్‌కు ఎమ్మెల్సీ కవిత 24 గంటల డెడ్‌లైన్.. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందే..!

MLC Kavitha Challenges to MP Arvind: ఎంపీ అర్వింద్‌కు ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలు 24 నిరూపించాలని అన్నారు. లేకపోతే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందన్నారు.

Written by - Ashok Krindinti | Last Updated : Jul 21, 2023, 04:12 PM IST
MLC Kavitha: ఎంపీ అరవింద్‌కు ఎమ్మెల్సీ కవిత 24 గంటల డెడ్‌లైన్.. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందే..!

MLC Kavitha Challenges to MP Arvind: తనపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ ఎంపీ అరవింద్‌కు 24 గంటల పాటు సమయం ఇస్తున్నానని.. ఆలోగా ఆరోపణలలో రుజువు చేయకపోతే పులాంగు చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. అర్థం పడటం లేని ఆరోపణలు చేస్తే బాగుండదని హెచ్చరించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన కవిత.. మీడియాతో ముచ్చటించారు. ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పనిచేస్తోందని.. అందుకే ఎన్నో కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నామని తెలిపారు. గతంలో పాలించిన పార్టీలు కమిషన్లకు కక్కుర్తి పడేదని, బీఆర్ఎస్ పార్టీలో ఆ పరిస్థితి లేదని అన్నారు. 

ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో రింగ్ రోడ్డును పూర్తి చేయలేకపోయారని కవిత అన్నారు. తనతో పాటు తమ పార్టీ ఎమ్మెల్యేలు వెంటబడి పరిష్కస్తే నిర్మాణం పూర్తయిందన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డబ్బులు ఎవరు, ఏ కుటుంబం తిన్నదో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. "అరవింద్‌కు 24 గంటల సమయం ఇస్తున్నా. నాకు ఎవరు ఒక రూపాయి ఇచ్చారో రుజువు చేయాలి. కాయిదం పట్టుకురా.. లేకపోతే పులాంగ్ చౌరస్తాలో ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పాలి. నా తండ్రిని అంటే వదిలేశాం. ఇప్పుడు నా భర్తను కూడా విమర్శిస్తే ఎవరూ ఊరుకోరు. మజాక్ చేస్తే బాగుండదు. రాజకీయాల్లో లేని తన భర్త పేరును ఎందుకు తీస్తున్నారు..? చౌకాబారు రాజకీయాలు మానుకోవాలి. అరవింద్ ఎక్కడ పోటీ చేసినా అక్కడికి వెళ్లి ఆయనను ఓడించి మా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తా.." అని కవిత స్పష్టం చేశారు.

మణిపూర్ అల్లర్లపై, నిరుద్యోగంపై బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని అడిగారు. రైతు బంధు పథకానికి కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ఎస్ఆర్ఎస్పీ పునరుద్ధరణ ప్రాజెక్టులో బీజేపీది ఒక్క రూపాయి కాంట్రిబ్యూషన్ లేదని చెప్పారు. జాతీయ రహదారులపై గుంతలు ఉంటాయా ఎక్కడైనా..? ఏం చేస్తున్నాడు గడ్డిపీకుతున్నాడా..? అని అర్వింద్‌ను ఉద్ధేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అన్ని విషయాలపై నిలదీస్తామని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి అర్వింద్ ఏం తెచ్చారని నిలదీశారు. అబద్ధాల మీద సమాజం నడవదని సూచించారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడికి వెళ్లి తప్పుడు హామీలు ఇచ్చి ఓట్లు దండుకోవడమే బీజేపీ ఎజెండా అని ఆరోపించారు.

రైతులు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కసు వెల్లగక్కుతున్నారని, రైతులకు మూడు గంటల విద్యుత్ చాలని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ వ్యాపారవేత్తలకు కూడా మూడు గంటలే సరిపోతుందని చెప్పగలదా అని ప్రశ్నించారు కవిత. పైసలు ఉన్న వారి పక్షాన మాత్రమే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నిలబడుతాయని, బీఆర్ఎస్ ఎప్పడూ పేదల పక్షాన నిలబడుతుందన్నారు. కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాతున్నారో వాళ్లకే అర్థం కాదన్నారు. 

"అప్పుడేమో సోనియా గాంధీ దయ్యమంటరు.. పావురాల గుట్టలో పావురంలా మాయమయిపోండని వైఎస్‌ను విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వైఎస్ ఉచిత కరెంట్ ఇచ్చిండని అంటారు. అర్థం పర్థంలేనటువంటి మాటలు మాట్లాడుతారు." అని కాంగ్రెస్ నేతలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రైతుల పట్ల కాంగ్రెస్ వైఖరి ప్రజలకు అర్థమయిందని చెప్పారు. రైతులకు కాంగ్రెస్ సాయం చేయదన్న ఆలోచన ప్రజల్లో వచ్చిందన్నారు.  

Also Read: Whatsapp Latest Update: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. వీడియో కాల్ లిమిట్ పెంపు  

Also Read: Manipur Violence: ఏ మాత్రం కనికరం చూపలేదు.. భయంకరమైన ఘటన గుర్తుచేసుకున్న బాధితురాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News