CONGRESS PARTY: మా అడ్డాలో మీ పెత్తనమా.. కామారెడ్డి ఎమ్మెల్యేలు రివర్స్‌!

CONGRESS PARTY: ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఆ ఎంపీకి సొంత పార్టీ లీడర్లే చుక్కలు చూపిస్తున్నారా..! ఎంపీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నా.. ఆ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదా..! కాంగ్రెస్ పార్టీలో సీనియర్‌ నేతగా ఉన్న ఆ ఎంపీకే ముప్పుతిప్పలు పెడుతున్న ఎమ్మెల్యేలు ఎవరు..! సొంత పార్టీ లీడర్ల తీరుపై ఎంపీ కూడా గుర్రుగా ఉన్నారా..!

Written by - G Shekhar | Last Updated : Nov 29, 2024, 05:08 PM IST
CONGRESS PARTY: మా అడ్డాలో మీ పెత్తనమా.. కామారెడ్డి ఎమ్మెల్యేలు రివర్స్‌!

CONGRESS PARTY: ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని జహీరాబాద్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట. జహీరాబాద్‌ పార్లమెంటు  పరిధిలోకి మెదక్‌ లోని కొన్ని నియోజకవర్గాలు, కామారెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గాలు వస్తాయి. మహారాష్ట్ర, కర్ణాటకకు సరిహద్దులో ఉండటంతో ఈ పార్లమెంటుపై పక్కా రాష్ట్రాల ఓటర్లు ప్రభావం కూడా ఉంటుంది. అయితే చాలా ఏళ్లుగా జహీరాబాద్‌ రాజకీయాల్లో కీలకంగా ఉన్న సురేష్‌షేట్కార్‌.. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. కానీ ఇప్పుడు ఎంపీ సురేష్‌ షేట్కార్‌ను సొంత పార్టీ లీడర్లే లైట్‌ తీసుకుంటున్నట్టు తెలిసింది. ఎంపీ హాజరవుతున్న ప్రతి మీటింగ్‌కు కామారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు ఎంపీలు వరుసగా డుమ్మా కొట్టడం హాట్‌ టాపిక్‌ అయ్యింది.

తాజాగా కామారెడ్డి కలెక్టరేట్‌లో దిశా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ సురేష్‌ షేట్కర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన పార్లమెంటు పరిధిలోని నలుగురు ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానం పలికారు. కానీ ఈ సమావేశానికి కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి హాజరయ్యారు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం డుమ్మా కొట్టారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు రాలేదు. ఈముగ్గురు ఎమ్మెల్యేలు కొద్దిరోజులుగా ఎంపీ సమావేశానికి డుమ్మా కొడుతున్నట్టు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ సొంత నియోజకవర్గాల్లో ఎంపీకి ఆహ్వానం సైతం పలకడం లేదట. ఇందుకు కారణం కాంగ్రెస్‌లోని గ్రూపులే అన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల కామారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ సమయంలో అధికార పార్టీ రెండు గ్రూపులుగా చీలిపోయినట్టు సమాచారం. అటు జుక్కల్‌ లోనూ సేవ్‌ సీన్‌ ఉందట. తోట లక్ష్మీకాంతరావుకు సైతం సొంత పార్టీలోనే నిరసన సెగ తగులుతోందట. అటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనూ గ్రూపు కొట్లాటలు తారాస్థాయికి చేరినట్టు సమచారం. ఇందుకు కారణం ఎంపీ ఎన్నికల్లోనూ సురేష్‌ షేట్కర్‌కు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు సహకరించలేదని వాదన సైతం ఉంది. అందుకే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎంపీతో ఎడమోహం, పెడమోహంగా ఉన్నట్టు తెలుస్తోంది.

మొత్తంగా అధికార పార్టీలోనే ఇలా గ్రూపులుగా విడిపోవడంపై టీపీసీసీ సైతం ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే త్వరలో జరిగే స్థానిక సంస్థల్లోనూ పెద్ద దెబ్బ పడుతుందని నేతలు భావిస్తున్నారట. లోకల్‌ బాడీ ఎన్నికల్లోపు సమస్యను పరిష్కరిస్తేనే ప్రయోజనం ఉంటుందని.. లేనిపక్షంలో తీవ్ర నష్టం జరుగుతుందని జిల్లా నేతలు పార్టీ పెద్దలకు చెబుతున్నట్టు తెలిసింది. చూడాలి మరి ఎంపీ- వర్సెస్‌ ఎమ్మెల్యేల పంచాయితీని పార్టీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాలి..

Also Read: Konda Surekha Crimimal Case: కొండా సురేఖపై క్రిమినల్ కేసు.. మంత్రి పదవి ఊస్టింగేనా..?

Also Read: Lagacharla Farmers: లగచర్ల రైతుల విజయం.. రేవంత్‌ రెడ్డి మరో యూటర్న్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News