MLA Harish Rao: రేవంత్ నీ చిత్త శుద్ధిని నిరూపించుకో.. గన్ పార్కు వద్ద కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే హరీష్ రావు..

MLA Harish Rao:బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గన్ పార్కు వద్ద అమర వీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు. సీఎం రేవంత్ కు వేసిన ఛాలెంజ్ లో భాగంగా ఆయన గన్ పార్క్ వద్దకు చేరుకుని రాజీనామా పత్రంతీసుకుని వచ్చారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 26, 2024, 01:43 PM IST
  • గన్ పార్కు వద్ద చేరుకున్న హరీష్ రావు..
  • దమ్ముంటే సవాల్ స్వీకరించాలని సవాల్..
MLA Harish Rao: రేవంత్ నీ చిత్త శుద్ధిని నిరూపించుకో.. గన్ పార్కు వద్ద కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే హరీష్ రావు..

MLA Harish Rao challange to cm revanth Reddy At Gurnpark: తెలంగాణ లో రాజకీయాలు ఎన్నికలు సమీపిస్తున్న కొలది శరవేగంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, సీఎం రేవంత్ కు దమ్ముంటే తెలంగాణ అమర వీరుల స్థూపం వద్దకు రావాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ, ఆరు గ్యారంటీల అమలు తోపాటు, 13హమీలను నెరవేరిస్తే తన ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తానని అన్నారు. ఒకవేళ సీఎం రేవంత్ హమీలను అమలు చేయలేని పరిస్థితిలో తన సీఎం పదవీకి రాజనీమాచేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. తనరాజీనామాను జర్నలిస్టుల చేతికి ఇచ్చి వెళ్తున్నట్లు పేర్కొన్నారు.

Read More: Rajasthan Man Collapses: పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తుండగా ఊహించని ఘటన.. వీడియో వైరల్..

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. డిసెంబర్ 9 న రుణమాఫీ, ఆరుగ్యారంటీల మీద తొలిసంతకం, అంటూ బాండ్ పేపర్ ల మీద రాసి ప్రజల్ని మోసం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజలను మరోసారి కాంగ్రెస్ మోసం చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. వందరోజుల్లో పథకాలు, రైతులకు రుణమాపీ అన్నారు. అది కూడా చేయలేదని గుర్తు చేశారు.

ఇక ఇప్పుడు దేవుళ్ల మీద సీఎం రేవంత్ ఓట్లు వేస్తు కొత్తనాటాకానికి తెరతీశానని హరీష్ రావు విమర్శించారు. ఒక వేళ ఆగస్టు 15 వరకు రుణమాఫీ, ఆరుగ్యారంటీల పథకంలను అమలు చేస్తే తన రాజీనామాను స్పీకర్ కు పంపుతానని, ఒక వేళ చేయకపోతే.. సీఎం రాజీనామాను గవర్నర్ కు సమర్పించాన్నారు. తెలంగాణ ప్రజలకు మంచి జరగడమే తమకు కావాల్సిందని హరీష్ రావు అన్నారు. తమకు పదవులు ఎక్కువ కాదని, ప్రజలకు మేలు జరిగితే అంతే చాలన్నారు.

Read MOre: Viral video: రా రా రక్కమ్మ.. పాటకు మాస్ స్టెప్పులు వేసిన పెళ్లికూతురు.. వీడియో చూస్తే ఆపుకోలేరు..

ప్రజలు అపోసిషన్ లీడర్ల బాధ్యత తమకిచ్చారని, అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చిన హమీలు నెరవేర్చకపోతే తప్పకుండా ప్రశ్నిస్తామన్నారు. దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలంటూ కూడా హరీష్ రావు సీఎం రేవంత్ ను కోరారు. ఎన్నికలలో గెలిచే వరకు ఒక మాట, గెలిచాక కాంగ్రెస్ పార్టీ మరో మాట మాట్లాడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. తెలంగాణలో ప్రజలకు కాంగ్రెస్ అబద్దపు హమీలిచ్చిందని ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News