Minister KTR: తెలంగాణకు మరోమారు భారీ వర్ష సూచన..అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి కేటీఆర్..!

Minister KTR: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈనేపథ్యంలో సహాయక చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. 

Written by - Alla Swamy | Last Updated : Jul 27, 2022, 04:44 PM IST
  • తెలంగాణలో భారీ వర్షాలు
  • సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష
  • అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
Minister KTR: తెలంగాణకు మరోమారు భారీ వర్ష సూచన..అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి కేటీఆర్..!

Minister KTR: వరదల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌తోపాటు ప్రధాన ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. వర్షాలు ఇలాగే కొనసాగితే ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పురాతన భవనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ..ప్రమాదకరంగా ఉన్న వాటిని తొలగించాలని చెప్పారు. నగరాలు, పట్టణాల్లో ఉన్న కల్వర్టులు, బ్రిడ్జిలకు సంబంధించిన ప్రాంతాలపై నిఘా ఉంచాలని..హెచ్చరిక సూచీలు ఏర్పాటు చేయాలన్నారు. 

స్థానికంగా ఉన్న పోలీస్, సాగునీటి, విద్యుత్, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌, ఇతర పురపాలికల్లో యంత్రాంగం, స్థానిక జల మండలి అధికారులు కలిసి వరద నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న జీహెచ్‌ఎంసీ, జలమండలి కమాండ్ కంట్రోల్ సెంటర్లను విస్తృతంగా ఉపయోగించుకోవాలన్నారు. రాష్ట్రంలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీడీఎంఏకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. 

నగరాలు, పట్టణాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలపై దృష్టి పెట్టాలన్నారు. జనవాస ప్రాంతాలకు ఆనుకుని ఉన్న చెరువులు, కుంటలు, ఇతర సాగు నీటి వనరులపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు మంత్రి కేటీఆర్. వర్షాలు తగ్గుముఖం పట్టగానే యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

దీని ప్రభావంతో రాగల మూడురోజులపాటు తెలంగాణలో వర్షాలు పడనున్నాయి. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు, ఎల్లుండి ఇదే వాతావరణం ఉండనుంది. మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటు ఏపీలోనూ ఉపరితల ఆవర్తన ప్రభావం అధికంగా ఉంది. దీని ప్రభావంతో రాగల మూడురోజులపాటు విస్తారంగా వర్షాలు కురువనున్నాయి.

Also read:Union Govt: తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు అప్పుడే..కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..!

Also read:Telangana Govt: రేపు హైదరాబాద్‌లో అందుబాటులోకి 6 అర్బన్ ఫారెస్ట్ పార్కులు..ఎక్కడెక్కడంటే..!  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News