Minister KTR on Agnipath: త్రివిధ దళాల్లో సైనిక నియామకాలకు కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదో విప్లవాత్మక పథకమని.. దేశ యువత ఉజ్వల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం చెబుతోంది. విపక్షాలు మాత్రం ఈ నిర్ణయం ఆర్మీతో పాటు యువతకు నష్టం చేస్తుందని అభిప్రాయపడుతున్నాయి. దేశవ్యాప్తంగా దీనిపై యువత నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైనా కేంద్రం వెనక్కి తగ్గే సూచనలు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో విపక్షాల నుంచి మరిన్ని విమర్శలు ఎదురవుతున్నాయి. తాజాగా మంత్రి కేటీఆర్ అగ్నిపథ్‌పై ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
'ఒక కేంద్రమంత్రి మాట్లాడుతూ.. అగ్నిపథ్ స్కీమ్ వల్ల యువత డ్రైవర్లు, ఎలక్ట్రిషియన్లు, బార్బర్స్, వాషర్‌మెన్‌గా ఉద్యోగాలు పొందుతారని చెబుతున్నారు. మరో బీజేపీ నేత మాట్లాడుతూ.. అగ్నివీరులను సెక్యూరిటీ గార్డులుగా పెట్టుకుంటామని పేర్కొన్నారు. మళ్లీ మీరే నరేంద్ర మోదీని యువత అర్థం చేసుకోవట్లేదని నిందిస్తారు..' అంటూ కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎన్‌పీఏ (నాన్ పెర్ఫామెన్స్ అసెట్)గా పేర్కొంటూ ఎద్దేవా చేశారు.
ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అగ్నిపథ్‌పై మాట్లాడుతూ.. ఈ స్కీమ్ ద్వారా రిక్రూట్ అయ్యేవారికి డ్రైవర్లుగా, ఎలక్ట్రిషియన్లుగా, బట్టలు ఉతికేవారిగా, హెయిర్ కట్ చేసేవారిగా స్కిల్స్ నేర్పిస్తారని పేర్కొన్న సంగతి తెలిసిందే. మరో బీజేపీ నేత కైలాష్ విజయ్ వర్గియా మాట్లాడుతూ.. ఈ స్కీమ్ ద్వారా రిక్రూట్‌మెంట్ అయ్యేవారిని.. సర్వీస్ తర్వాత తమ ఆఫీసుల్లో సెక్యూరిటీ గార్డులుగా పెట్టుకుంటామని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ తాజాగా తన ట్వీట్ ద్వారా బీజేపీ తీరును ఎండగట్టే ప్రయత్నం చేశారు.
మరో ట్వీట్‌లో మోదీ-అదానీ అవినీతి ఆరోపణలపై శ్రీలంక చేసిన ఆరోపణల నుంచి దేశ ప్రజల దృష్టి మరల్చేందుకే అగ్నిపథ్‌ను ప్రకటించారా అంటూ ప్రశ్నించారు. శ్రీలంకలో ఓ పవర్ ప్రాజెక్టును గౌతమ్ అదానీకి కట్టబెట్టేందుకు ప్రధాని మోదీ జోక్యం చేసుకున్నారని.. శ్రీలంక ప్రభుత్వంపై ఆయన ఒత్తిడి తెచ్చారని సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) ఛైర్మన్ ఫెర్డినాండ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడమే కాదు, తన పదవికి రాజీనామా చేశారు. విద్యుత్ ప్రాజెక్ట్ విషయంలో తమపై ఎలాంటి ఒత్తిడి లేదని శ్రీలంక ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. అయినప్పటికీ విపక్షాలు మాత్రం ఈ అంశంలో మోదీని టార్గెట్ చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కేటీఆర్ ట్విట్టర్ ద్వారా కేంద్రాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు.
Was #AgnipathScheme announcement just a ruse to divert India’s attention from #Srilanka allegations on Modi - Adani corruption nexus?#JustAsking
— KTR (@KTRTRS) June 20, 2022
A Cabinet Minister of NPA Govt says #AgnipathScheme can result in youth being employed as Drivers, Electricians, Barbers & Washermen!
Yet another bright BJP leader says he will employ #Agniveers as security guards!
And you blame the youth that they don’t understand you Modi ji? https://t.co/PWjcaLwWQq
— KTR (@KTRTRS) June 20, 2022
Also Read: Etela Rajender: కోమటిరెడ్డి కారులో ఈటల రాజేందర్.. ఢిల్లీలో ఏం జరిగింది?
Also Read: Anand Mahindra: అగ్నివీరులకు బంపర్ ఆఫర్.. ఉద్యోగమిస్తామన్న ఆనంద్ మహీంద్రా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
KTR on Agnipath: అగ్నిపథ్‌పై కేంద్రం తీరును ఎండగట్టిన కేటీఆర్.. దేశం దృష్టిని మరల్చేందుకేనా అంటూ ప్రశ్నించిన మంత్రి..
అగ్నిపథ్‌పై కేంద్రాన్ని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్
కేంద్రం చెప్పేది ఒకలా.. బీజేపీ నేతల వ్యాఖ్యలు మరోలా..
మోదీని అర్థం చేసుకోవట్లేదంటే మళ్లీ యువతపైనే నిందలా..