హైదరాబాద్ : దేశం అంతా ఒకే రకమైన విధానం అమలయ్యేలా విద్యుత్ వ్యవస్థను ఒక గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ చట్టరూపం దాల్చితే రైతన్నలు, ఎస్సీ, ఎస్టీలకు లభించే సబ్సిడీపై ప్రభావం పడుతుందని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ( Minister Jagadish Reddy ) అన్నారు. ఈ బిల్లు నేపథ్యాన్ని గమనిస్తే.. యావత్ దేశంలోని విద్యుత్ రంగం మొత్తం ప్రైవేటీకరణ అవుతుందా అనే సూచనలు కనిపిస్తున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Also read : దిల్ రాజు పెళ్లిపై అంత ఇంట్రస్ట్ ఎందుకంటే..
ఒకే దేశం.. ఒకే విద్యుత్ విధానంపై సోమవారం మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఒకవేళ ఈ బిల్లు అమలులోకి వస్తే ఏం జరుగుతుందనే అంశంపై పలు సమీక్షలు జరిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. దీనిని వ్యతిరేకించడం జరిగిందని అన్నారు. ఇదే విషయమై తెలంగాణ సర్కార్ అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. త్వరలోనే కేంద్రానికి ఓ లేఖ రాయనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..