Osmania Hospital Building: ఆ వెంటనే ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్.. మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

Osmania Hospital New Building Construction: ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి నూతన నిర్మాణానికి అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులు ఏకగ్రీవ అభిప్రాయం తెలిపారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రజల వైద్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఉన్న పాత భవనాలను తొలగించి వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారని మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు.

Written by - Pavan | Last Updated : Jul 4, 2023, 06:14 AM IST
Osmania Hospital Building: ఆ వెంటనే ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్.. మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

Osmania Hospital New Building Construction: ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి నూతన నిర్మాణానికి అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులు ఏకగ్రీవ అభిప్రాయం తెలిపారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రజల వైద్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఉన్న పాత భవనాలను తొలగించి వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారని.. ఈ అభిప్రాయాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలించి, అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు తెలియచేస్తుందని మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. హైకోర్టు నుండి అనుమతి వచ్చే వరకు వేచి చూసి, అనుమతి వచ్చిన వెంటనే నూతన భవన నిర్మాణం చేపడతామని తేల్చిచెప్పారు. ప్రజల భవిష్యత్ అవసరాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే నాలుగు టిమ్స్, నిమ్స్ విస్తరణ, సూపర్ స్పెషాలిటీ ఎం సి హెచ్ ల నిర్మాణం చేపట్టడం జరిగింది అని మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు.

ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం నిర్మించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. వాస్తవానికి 2015 లోనే ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్.. పాత భవనాలు శిథిలావస్తకు చేరుకుంటున్నందున వాటి స్థానంలో కొత్త భవనాల నిర్మాణాలు చేపట్టాల్సిందిగా ఆదేశించినట్లు గుర్తుచేసారు. అయితే, అవి చారిత్రక కట్టడాలు అయినందున వాటిని కూల్చవద్దని కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో హై కోర్టు అప్పట్లో స్టే ఇచ్చింది అనే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. ఆ కారణం చేతనే ఉస్మానియా ఆసుపత్రి అభివృద్ధికి ఆటంకం కలిగిందని.. లేదంటే ఆసుపత్రి అభివృద్ధి పనులు ఎప్పుడో మొదలయ్యేవి అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు వేసిన ఐఐటి హైదరాబాద్ నిపుణుల కమిటీ కూడా భవిష్యత్ లో ఆసుపత్రి అవసరాలకు ఈ భవనం ఇక పని చేయదని చెప్పిందని అప్పట్లో ఐఐటి హైదరాబాద్ కమిటి నివేదికను మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. తదుపరి కోర్టు ఆదేశాల ప్రకారం సోమవారం ఆసుపత్రి పరిధిలోని ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు తీసుకోవడం జరిగిందన్నారు. కొత్త భవనం నిర్మాణానికి ప్రజాప్రతినిధులు అందరూ ఏకగ్రీవంగా అంగీకరించడం సంతోషకరం అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : Telangana Politics: అవినీతికి కాంగ్రెస్ రారాజు.. అందుకే రాహుల్ గాంధీ ఓడిపోయారు: మంత్రులు ఫైర్

ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం అంశంపై ఆసుపత్రి పరిధి ప్రజా ప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో కొత్త సచివాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపి అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, వాణీ దేవి, రహమత్ బెగ్, హసన్ ఎఫెండి, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్, దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, జాఫర్ హుస్సేన్, కౌసర్ మోయినుద్దీన్, హెల్త్ సెక్రెటరీ ఎంఏ రిజ్వి, సీఎం ఓఎస్డీ గంగాధర్, ఇ ఎన్ సి గణపతి రెడ్డి, ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేంద్ర తదితరులు పాల్గొని ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనాల నిర్మాణంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఇది కూడా చదవండి : Rs 4000 Old Age Pension: తెలంగాణలో రూ. 4 వేల వృద్ధాప్య పెన్షన్.. బీఆర్ఎస్‌కి గట్టి దెబ్బ పడనుందా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News