Errabelli Dayakar Rao: పిల్ల‌ల‌తో కలిసి గోలీలాడిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

Errabelli Dayakar Rao: నిత్యం అభివృద్ధి పనులతో బిజీబీజీగా ఉండే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నట్టుండి చిన్నపిల్లాడిలా మారిపోయి వారితో కలిసి సరదాగా ఆడుకున్నారు. జ‌న‌గామ జిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం, దేవ‌రుప్పుల మండ‌లం సింగ‌రాజుప‌ల్లిలో సోమ‌వారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 2, 2023, 04:20 AM IST
Errabelli Dayakar Rao: పిల్ల‌ల‌తో కలిసి గోలీలాడిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

Errabelli Dayakar Rao Playings Goleelu with Kids: తన సొంత నియోజకవర్గం ప్ర‌జ‌ల‌తో ఇట్టే క‌లిసిపోయే నాయకుడిగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకి మంచి పేరుంది. తరచుగా నియోజకవర్గంలో పర్యటించి, గ్రామాల్లో జనం సమస్యలు అడిగి తెలుసుకుంటూ, అభివృద్ధి పనుల్లో పాల్పంచుకుంటూ ముందుకుసాగిపోయే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం కూడా పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించారు.

జ‌న‌గామ జిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం, దేవ‌రుప్పుల మండ‌లం సింగ‌రాజుప‌ల్లిలో సోమ‌వారం జరిగిన పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న సందర్భంగా స్థానిక పాఠ‌శాల‌ను ప‌రిశీలించారు. వేసవి సెలవులు కావడంతో ఆ స‌మ‌యంలో ఆ పాఠశాల ఆవ‌ర‌ణ‌లో స్కూల్ పిల్ల‌లు గోలీలు అడుతూ క‌నిపించారు. స్కూల్ పిల్లలు గోలీలు ఆడటం చూసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. వెంటనే వారి వద్దకు వెళ్లి వారితో కలిసిపోయారు. కాసేపు తాను మంత్రిని అనే విషయం మర్చిపోయిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. పిల్లలతో కలిసి గోలీలు ఆడారు. 

తన చిన్ననాడు స్నేహితులతో కలిసి ఆడిన ఆట‌లను గుర్తు చేసుకుంటూ పిల్ల‌ల్లో పిల్లాడిలా మారిపోయారు. సాధారణంగా అయితే, నిత్యం అధికారులకు ఆదేశాలిస్తూ ఎంతో బిజీబిజీగా కనిపించే తమ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నట్టుండి ఇలా గోలీలు ఆడ‌ుతుండటం చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోయారు.

 

తమలో కలిసిపోయి, తమలో ఒకరిగా గోలీలు ఆడుతున్న మంత్రి ఎర్రబెల్లిని చూసి పిల్ల‌లు ఎలా రియాక్ట్ అయ్యారనే సంగతి ఇక చెప్పనక్కరేలేదు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆట విడుపు చూసిన సింగరాజుపల్లి గ్రామస్తులు.. ఎర్రబెల్లి ఎంత ఎత్తుకు ఎదిగినా తన చిన్ననాటి మూలాలను, జ్ఞాపకాలను ఇంకా మర్చిపోలేదని అనుకోసాగారు.

Trending News