Jr Ntr As TDP Chief: దమ్ముంటే జూనియర్ ఎన్టీఆర్‌‌ని సీఎం చేయ్.. చంద్రబాబుకు మంత్రి ఎర్రబెల్లి సవాల్

Jr Ntr As TDP Chief: తెలంగాణలో, ఆంధ్రలో.. రెండు చోట్ల ఫెయిల్ అయిన చంద్రబాబు ఎక్కడ పొద్దుబోక బిజెపితో మూలాఖత్ అయ్యి రాష్ట్రంలో చిచ్చుపెట్టే పని మొదలు పెట్టాడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిది కాదన్న మంత్రి ఎర్రబెల్లి.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 24, 2022, 05:53 AM IST
  • చంద్రబాబు నాయుడిపై మంత్రి ఎర్రబెల్లి ఘాటు వ్యాఖ్యలు
  • నారా లోకేష్‌ని ఎవ్వరు కోరుకుంటున్నారంటూ మండిపాటు
  • చంద్రబాబుకు టీడీపీ మీద ప్రేమ ఉంటే ఆ పని చేయాలని సవాల్
Jr Ntr As TDP Chief: దమ్ముంటే జూనియర్ ఎన్టీఆర్‌‌ని సీఎం చేయ్.. చంద్రబాబుకు మంత్రి ఎర్రబెల్లి సవాల్

Jr Ntr As TDP Chief: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తనదైన స్టైల్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆంధ్రాలో నీ కొడుకు నారా లోకేష్‌ని ఎవ్వరూ కోరుకోవడం లేదని చురకలు అంటించిన మంత్రి ఎర్రబెల్లి.. నీకు తెలుగు దేశం పార్టీపై కానీ లేదా స్వర్గీయ నందమూరి తారక రామారావుపై గౌరవం ఉన్నట్టయితే.. జూనియర్ ఎన్టీఆర్ ని తెలుగు దేశం పార్టీకి అధ్యక్షుడిని చేసి ఏపీకి ముఖ్యమంత్రిని చేయాలని సవాల్ విసిరారు. లేదంటే తెలంగాణలో వైఎస్ షర్మిల, కేఏ పాల్ ఏమయ్యారో.. ఏపీలో చంద్రబాబు కూడా అదే అవుతారని అన్నారు. 

తెలంగాణలో, ఆంధ్రలో.. రెండు చోట్ల ఫెయిల్ అయిన చంద్రబాబు ఎక్కడ పొద్దుబోక బిజెపితో మూలాఖత్ అయ్యి రాష్ట్రంలో చిచ్చుపెట్టే పని మొదలు పెట్టాడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిది కాదన్న మంత్రి ఎర్రబెల్లి... నిజంగా చంద్రబాబుకు టిడిపిపై, ఎన్టీఆర్‌పై ప్రేమే ఉంటే.. ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ ఆ పార్టీకి అధ్యక్షుడిగా చేసి, ముఖ్యమంత్రిని చేయాలని.. అప్పుడే ఆయన చిత్తశుద్ధి తెలుస్తుంది అని అన్నారు. హనుమకొండలో శుక్రవారం "రైతు కల్లాలు - కేంద్ర ప్రభుత్వ వైఖరి" పై నిర్వహించిన మీడియా సమావేశంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్పందిస్తూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఎన్టీ రామారావు ఎందరికో స్ఫూర్తి. ఎన్టీ రామారావు పేద ప్రజలకు చేసిన సేవ ఇప్పటికీ రెండు రాష్ట్రాల్లో పేద ప్రజలు మర్చిపోలేదు. పేదల స్కీమ్స్ తెచ్చింది ఎన్టీ రామారావు. అది నువ్వు కాదు. ఎన్టీ రామారావు స్ఫూర్తి తీసుకొని, ఎన్టీ రామారావు వద్ద పని తీసుకొని, ఎన్టీ రామారావుతో బతికినవు.. ఆ తరవాత ఆ కుటుంబాన్నే మోసం చేసినవు అని చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీ కొడుకుని ఆంధ్రాలో పెట్టి, పాపం హరికృష్ణ బిడ్డను తెలంగాణలో పెట్టావు. అది కక్ష సాధింపు చర్య కాదా అని ప్రశ్నించారు. 

జూనియర్ ఎన్టీఆర్‌ను ఏపీలో కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ని ఆంధ్రా ప్రజానికం టీడీపీ అధ్యక్షునిగా కోరుకుంటున్నారు కానీ లోకేష్‌ని కోరుకోవడం లేదు. ఆంధ్రాలో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వాళ్లున్నారు. నీ కొడుకు కావాలని ఎవ్వరూ కోరుకోవట్లేదు. కానీ నువ్వు మాత్రం జనం కోరుకుంటున్న జూనియర్ ఎవ్టీఆర్‌ని పక్కనపెట్టి ఎవ్వరూ కోరుకోని లోకేష్‌ని ఎంకరేజ్ చేస్తున్నావ్. నీకు తెలుగుదేశంతో పార్టీ మీద విశ్వాసం ఉన్నా.. ఎన్టీఆర్ మీద ప్రేమ ఉన్నా జూనియర్ ఎన్టీఆర్‌ని తీసుకొచ్చి అక్కడ ముఖ్యమంత్రి చేయి అంటూ చంద్రబాబు నాయుడుకు సవాలు చేశారు. చంద్రబాబు నాయుడు ఆ పని చేస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఆయనకు ఎంత విశ్వాసం ఉంది ? ఎన్టీ రామారావు మీద ఎంత కృతజ్ఞత ఉందనేది తెలుస్తుందని అన్నారు.

ఇది కూడా చదవండి : Brs Mlas Meeting: బీఆర్ఎస్‌లో ముసలం.. తెలంగాణ టు ఏపీ.. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు మళ్లీ రహాస్య భేటీ..?

ఇది కూడా చదవండి : Minister Harish Rao: చంద్రబాబు వల్లే సూర్యుడు ఉదయిస్తోంది.. కోడి కూస్తోంది.. మంత్రి హారీష్ రావు పంచ్‌ల వర్షం

ఇది కూడా చదవండి : COVID-19 Cases in AP: ఏపీలో కరోనా పరిస్థితిపై క్లారిటీ ఇదిగో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News