man murder case : మెట్టు మహంకాళి ఆలయం జైహింద్‌ నాయక్‌ హత్య కేసులో దర్యాప్తు వేగవంతం

mettu mahankali temple man murder case : మెట్టు మహంకాళి ఆలయం జైహింద్‌ నాయక్‌ హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసిన నల్లగొండ, రాచకొండ పోలీసులు. రాచకొండ పోలీస్ కమిషనర్, నల్లగొండ ఎస్పీ రమా రాజేశ్వరి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2022, 02:55 PM IST
  • జైహింద్‌ నాయక్‌ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
  • సంయుక్తంగా దర్యాప్తు చేపడుతోన్న నల్లగొండ, రాచకొండ పోలీసులు
  • రాచకొండ పోలీస్ కమిషనర్, నల్లగొండ ఎస్పీ రమా రాజేశ్వరి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు
man murder case : మెట్టు మహంకాళి ఆలయం జైహింద్‌ నాయక్‌ హత్య కేసులో దర్యాప్తు వేగవంతం

mettu mahankali temple man murder case : తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన జైహింద్‌ నాయక్‌ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం సాగుతోంది. జైహింద్‌ నాయక్‌ను (Jaihind Nayak) దారుణంగా హత్యచేసి శరీరం నుంచి తలను వేరుచేసి నల్లగొండ జిల్లా (nalgonda district) కుర్మేడు సమీపంలోని విరాట్‌నగర్‌ మెట్టు మహంకాళి ఆలయంలో (mettu mahankali temple) వదిలిపెట్టిన విషయం తెలిసిందే. 

ఈ కేసుపై నల్లగొండ, రాచకొండ పోలీసులు (rachakonda police) సంయుక్తంగా దర్యాప్తు చేపడుతున్నారు. వనస్థలిపురం పీఎస్ పరిధి తుర్కయంజాలో (turkayamjal) జైహింద్ నాయక్ హత్య జరిగింది. రాచకొండ పోలీస్ కమిషనర్, నల్లగొండ ఎస్పీ రమా రాజేశ్వరి (Nalgonda SP Rema Rajeshwari) స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి నిందితులను గాలిస్తున్నారు.

గుప్తనిధులు, క్షుద్రపూజలే ఈ హత్య కారణం అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఒంటిపై దుస్తువులు కూడా లేకుండా హత్యచేయడంతో నరబలి కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీ పుటేజ్, (cctv footage) ఫోన్ సీడీఆర్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు (Police) అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

ఈ కేసు జరిగిన వెంటనే స్పందించిన నల్గొండ పోలీసులు (nalgonda police) మొండెం కోసం నాలుగు రోజుల పాటు శ్రమించారు. తర్వాత నగర శివారుల్లోని తుర్కయంజాల్‌లో ఓ నిర్మాణంలో ఉన్న భవనంలో జైహింద్‌ నాయక్‌ మొండాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తుర్కయంజాల్‌ నుంచి నల్గొండ జిల్లా చింతపల్లి వరకు సాగర్‌ రహదారిలో ఉన్న ప్రతి సీసీ కెమెరాను (CCTV camera) పోలీసులు జల్లెడపడుతున్నారు.

Also Read : Corona in Telangana: తెలంగాణలో ఒక్క రోజులో 3,557 కరోనా కేసులు!

కాగా మతిస్థిమితం లేని జైహింద్‌ నాయక్‌ గత సంవత్సర కాలంగా తుర్కయంజాల్‌కు వచ్చి భిక్షాటన చేస్తూ జీవించేవాడు. తుర్కయంజాల్‌లోని బ్రాహ్మణపల్లి సమీపంలోని నిర్మాణంలో ఉన్న ఒక భవనంలో ఉండేవాడు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల గుర్తు తెలియని వ్యక్తులు అతిదారుణంగా జైహింద్‌ నాయక్‌ (Jaihind Nayak) తలను మొండెం నుంచి వేరు చేసి హత్య (Murder) చేశారు.

Also Read : Paracetamol dose: పారాసిటమోల్ ఏయే వయస్సుల వారికి ఎంత డోస్ అవసరమో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News