Brutal murder in Godavarikhani: పెద్దపల్లి (Peddapalli) జిల్లా గోదావరిఖనిలో దారుణ హత్య జరిగింది. స్థానికంగా మీసేవా (Mee Seva) ఆపరేటర్‌గా పనిచేసే శంకర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. హత్యానంతరం (Murder) మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. ఒక్కో శరీర భాగాన్ని ఒక్కో ప్రాంతంలో పడేశారు. మొదట అతని చేతులు, తల భాగాన్ని పోలీసులు గుర్తించగా.. ఆ తర్వాత వేర్వేరు ప్రాంతాల్లో ఇతర శరీర భాగాలు లభ్యమయ్యాయి. శంకర్ హత్య గోదావరిఖనిలో తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే... గోదావరిఖనిలోని (Godavarikhani) ఎన్టీపీసీ కాజిపల్లి గ్రామంలో కాంపెల్లి శంకర్(35) కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. స్థానికంగా ఉన్న మీ సేవా కేంద్రంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య హేమలత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. హేమలత ఎన్టీపీసీలోని (NTPC) ధన్వంతరి ఆసుపత్రిలో కాంట్రాక్టు నర్సుగా పనిచేస్తోంది. గురువారం (నవంబర్ 25) హేమలతకు నైట్ డ్యూటీ కావడంతో రాత్రి 10గం. సమయంలో శంకర్ ఆమెను ఆసుపత్రి వద్ద దిగబెట్టాడు.
ఇక ఆ తర్వాతి నుంచి శంకర్ ఆచూకీ తెలియరాలేదు. సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ అవడం, రాత్రంతా వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన చెందారు. మరుసటి రోజు శంకర్ తల్లి పోచమ్మ ఎన్టీపీసీ పోలీసులకు (Telangana Police) ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం (నవంబర్ 27) తెల్లవారుజామున రామగుండం (Ramagundam) సమీపంలోని మల్యాలపల్లి-రాజీవ్ రహదారి మార్గంలో గుర్తు తెలియని వ్యక్తి తల, చేతులను పోలీసులు గుర్తించారు.
Also Read: Madhya Pradesh Taj Mahal Replica: భార్య కోసం మరో తాజ్ మహల్ కట్టిన అభినవ షాజహాన్
పోలీసులు శంకర్ తల్లిని పిలిపించగా.. ఆ తల తన కుమారుడిదేనని గుర్తించింది. దీంతో దర్యాప్తు మరింత ముమ్మరం చేసిన పోలీసులు మేడిపల్లి ఓపెన్‌కాస్ట్‌కు వెళ్లే దారిలో శంకర్ మొండెం గుర్తించారు. సప్తగిరి కాలనీలో అతని కాళ్లను గుర్తించినట్లు తెలుస్తోంది. గోదావరిఖని (Godavarikhani) ప్రభుత్వ ఆసుపత్రిలో వాటిని భద్రపరిచారు. హత్యలో ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు (Murder) గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే తన కుమారుడి హత్యకు అతని భార్య, బంధువులే కారణమని శంకర్ తల్లి ఆరోపించారు. మరోవైపు, శంకర్ హంతకులను కఠిన శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానిక దళిత సంఘాల నేతలు ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్డు వద్ద నిరసన చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook