MBBS, BDS Admissions: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్ నోటిఫికేష్ వచ్చేసింది. ప్రైవేట్ వైద్య, దంత కళాశాలలో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సాయంత్రం 4గంటల నుంచి 6 గంటల వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని, సాంకేతికలోపం తలెత్తితే సమయం పొడిగించే అవకాశం ఉంది.
అయితే తొలి విడత కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్ (MBBS) సీటు పొంది కాలేజీలలో చేరని విద్యార్థులు, అదే విధంగా ఆల్ ఇండియా కోటాలో సీటు పొంది చేరనివారు సైతం ఈ కౌన్సెలింగ్‌కు అనర్హులు అని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు కాళోజీ యూనివర్సిటీ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in లో ఉంటాయని వర్సిటీ పేర్కొంది.
తెలంగాణ (Telangana)లోని ప్రైవేట్ వైద్య, దంత కళాశాలల్లో యాజమాన్య కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. కాగా, ఇటీవల 19వ తేదీన కొన్ని సీట్లను భర్తీ చేసేందుకు వెబ్ ఆప్షన్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. తాజాగా యూజమాన్య కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల గురువారం ఇచ్చుకోవాలని నోటిఫికేషన్‌లో తెలిపారు.
Also Read: Amazon Fab Phones Fest: స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్ బంపర్ ఆఫర్లు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook