Mancherial Fire Accident, 6 people burnt alive in terrible fire accident at Mandamarri: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనం అయ్యారు. మృతుల్లో ఇంటి యజమాని సహా ఆరుగురు ఉన్నారు. స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి నిప్పు పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
వెంకటాపూర్ పంచాయతీలోని వుడిపెల్లిలోని ఓ ఇంట్లో గత రాత్రి ఆరుగురు సజీవదహనమయ్యారు. మృతి చెందిన వారిలో ఇంటి యజమాని మాసు శివయ్య (50), ఆయన భార్య మాసు పద్మ (45), పద్మ అక్క కుమార్తె మౌనిక (25), మౌనిక ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వారితో పాటు సింగరేణి ఉద్యోగి శాంతయ్య (50) కూడా ఇంట్లో ఉన్నాడు. కోటపల్లి మండలంలోని కొండంపేట గ్రామానికి చెందిన మౌనిక రెండు రోజుల క్రితమే పిన్ని అయిన పద్మ ఇంటికి వచ్చింది. చుట్టం చూపుగా వచ్చిన ముగ్గరు ప్రాణాలు వదిలారు.
మందమర్రి డీసీపీ అఖిల్ మహాజన్, సీఐ ప్రమోదరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో షార్ట్ షర్య్కూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందా లేక ఎవరైనా ఈఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే మాసు శివయ్య భార్య పద్మతో సింగరేణి ఉద్యోగి శాంతయ్యకు అక్రమ సంబంధం ఉన్నట్లుగా సమాచారం తెలిసింది. విషయం తెలిసిన వారు అర్ధరాత్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.
చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఈ ప్రమాదంపై తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం కావడం తమని తీవ్రంగా కలచి వేసిందన్నారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. విచారణ వేగవంతం చేయాలని అధికారులను బాల్క సుమన్ ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు శుభవార్త.. వరుసగా రెండో రోజూ తగ్గిన పసిడి ధరలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.