Telangana: ఆసుపత్రి నుండి పారిపోయిన కరోనా పేషంట్..

తెలంగాణలో కరోనా మహమ్మారి (Covid-19) కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తి నివారణకు  కట్టుదిట్టమైన చేస్తున్న తరుణంలో పలు ఆశ్చ్యర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

Last Updated : Jun 4, 2020, 07:38 PM IST
Telangana: ఆసుపత్రి నుండి పారిపోయిన కరోనా పేషంట్..

హైదరాబాద్: తెలంగాణలో కరోనా (Covid-19) మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తి నివారణకు  కట్టుదిట్టమైన చేస్తున్న తరుణంలో పలు ఆశ్చ్యర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ లో ఉన్న (Gndhi Hospital) గాంధీ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా ప్రకటించిన తెలిసిందే..ఇదిలాఉండగా క్లిష్ట పరిస్థితుల్లో కరోనా సోకిన వ్యక్తి అదృశ్యమైన ఘటన కలకలం సృష్టిస్తోంది.

Also Read:  మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో నివాసించే 60 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యం కారణంగా మే 30న ఏరియా ఆస్పత్రికి వెళ్లాడు. కోవిడ్ (Covid-19 Symptoms) లక్షణాలుండడంతో (దగ్గు, దమ్ము, ఆస్తమా) గుర్తించిన వైద్యులు హైదరాబాద్ (Hyderabad) గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో గాంధీలో అతడికి ప్రోటోకాల్ ప్రకారం కరోనా పరీక్షలు (Coronavirus Tests) నిర్వహించగా పాజిటివ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ దృవీకరించింది. వృద్ధుడి గురించి వైద్య శాఖ అధికారులు సమాచారం ఇవ్వడంతో వైద్యులు, పోలీసులు స్థానికంగా సర్వే చేపట్టారు. బాధితుడికి చెందిన ప్రాథమిక వ్యక్తులపై (Primary Contacts) అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. కాగా బాధితుడు ఆసుపత్రి నుండి అదృశ్యమవడంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. మరోవైపు బాధితుడికి సంబందించిన 13 మంది కుటుంబ సభ్యులను అధికారులు (Home Quarantine) హోంక్వారంటైన్‌ లో ఉంచారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్

Trending News