Mynampally Hanumanth Rao: నా తడాఖా చూపిస్తా.. మంత్రి హరీశ్ రావుకు బీఆఎర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్

Mynampally Hanumanth Rao Vs Minister Harish Rao: మంత్రి హరీశ్ రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలన కామెంట్స్ చేశారు. మెదక్‌లో హరీశ్ రావు పెత్తనం ఏంటని..? సిద్దిపేట తన తడఖా చూపిస్తానని స్పష్టం చేశారు. మల్కజ్‌గిరి నుంచి తాను.. మెదక్ నుంచి తన కుమారుడు పోటీ చేస్తామన్నారు.    

Written by - Ashok Krindinti | Last Updated : Aug 21, 2023, 01:01 PM IST
Mynampally Hanumanth Rao: నా తడాఖా చూపిస్తా.. మంత్రి హరీశ్ రావుకు బీఆఎర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్

Mynampally Hanumanth Rao Vs Minister Harish Rao: మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి హరీశ్ రావుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మల్కాజ్ గిరి నుంచి తాను.. మెదక్ నుంచి తన కుమారుడు పోటీ చేస్తామన్నారు. మెదక్‌లో హరీశ్ పెత్తనం ఏంటి..? అని ప్రశ్నించారు. మెదక్ అభివృద్ధిని అడ్డుకున్నది హరీశ్‌ రావేనని ఆరోపించారు. అవసరమైతే సిద్దిపేటలో తన తడాఖా చూపిస్తానని.. హరీశ్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానని అన్నారు. కేసీఆర్ కుటుంబంలో చాలామందికి టికెట్ ఇచ్చారని పేర్కొన్నారు. తమ ఇద్దరికి టికెట్ ఇస్తేనే పోటీ చేస్తామని ఆయన అని స్పష్టం చేశారు.

"హరీశ్ రావుకు పెద్ద ఎత్తున బుద్ధి చెబుతాం. రబ్బరు చెప్పులతో ఎలా వెలమ హస్టల్‌కు వచ్చాడో అందరికీ తెలుసు. ఈసారి ఏ స్థాయిలో హరీశ్ రావు ఉన్నాడో అందరూ గమనించాలి. నూటికి నూరుపాళ్లు హరీశ్‌ రావుకు బుద్ధి చెబుతాను. ఈసాయి అయితే నాకు టైమ్ లేదు. మెదక్, మల్కాజ్‌గిరిపై దృష్టిపెడతాను. తరువాత సిద్దిపేటలో హరీశ్ రావు అడ్రస్ గల్లంతు చేస్తా. దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నేను మాట ఇస్తే మాట తప్పను. హరీశ్ రావును గద్దె దించేవరకు.. దుకాణం బంద్ చేయించే వరకు నేను నిద్రపోను.." అంటూ మైనంపల్లి సంచలన కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం మెదక్ నుంచి పద్మాదేవందర్ రెడ్డి పోటీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానం నుంచే తన కుమారుడు రోహిత్‌కు టికెట్ ఇప్పించుకునేందుకు మైనంపల్లి ఎప్పటి నుంచో పావులు కదుపుతున్నారు. మైనంపల్లి సొంత ప్రాంతం ఇక్కడే కావడం.. గతంలో ఎమ్మెల్యేగా పని చేయడం వంటి అంశాలను ఆయన సానుకూలంగా చెబుతున్నారు. ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో తన కుమారుడిని రంగంలో దింపేందుకు మైనంపల్లి ప్లాన్ చేస్తున్నారు. నేడు సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించనున్న నేపథ్యంలో మైనంపల్లి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

Also Read: Onion Prices Today: ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 40 శాతం ఎగుమతి సుంకం విధింపు  

Also Read: Interest Rates Hike:ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. సేవింగ్ అకౌంట్స్‌ వడ్డీ రేట్లు పెంపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News