TS Inter Results 2023: ఇంటర్ ఫలితాలు, మార్కుల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

TS Inter 1st year and 2nd Year Results 2023 Live Updates, tsbie.cgg.gov.in, results.cgg.gov.in, manabadi.com: ఇంటర్ ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఫలితాల లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.  

Written by - Ashok Krindinti | Last Updated : May 9, 2023, 11:50 AM IST
TS Inter Results 2023: ఇంటర్ ఫలితాలు, మార్కుల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Live Blog

TS Inter 1st year and 2nd Year Results 2023 Live Updates: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ రెండు సంవత్సరాలు కలుపుకుని 9 లక్షల మంది విద్యార్థులు రాశారు. మార్చి 15వ తేదీన ప్రారంభమైన పరీక్షలు.. ఏప్రిల్‌ 4వ తేదీ వరకు. మూల్యాంకన ప్రక్రియ, అప్‌లోడింగ్ ప్రక్రియ పూర్తవ్వడంతో ఫలితాలను విడుదల చేయనున్నారు.  రిజల్ట్స్‌ కోసం విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

9 May, 2023

  • 11:39 AM

    ==> ప్రైవేట్ జూనియర్ కాలేజీలో 63 శాతం ఉత్తీర్ణత 

    ==> గురుకుల జూనియర్ కాలేజీల్లో 92 శాతం 

    ==> సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 89 శాతం

    ==> బీసీ గురుకుల 87 శాతం ఉత్తీర్ణత 

    ==> కేజీబీవీలలో 77 శాతం, ట్రైబల్ 84 శాతం 

    ==> ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 54 శాతం ఉత్తీర్ణత 

    ==> రేపటి నుంచి రీ కౌంటింగ్, రీ వ్యాల్యుయేషన్‌కు అవకాశం 

    ==> ఈ నెల 16 వరకు ఫీజు కట్టేందుకు అవకాశం 

    ==> ఈ రోజు సాయంత్రం నుంచి కలర్ మెమోలు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం

  • 11:29 AM

    ==> గతేడాది కన్నా తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత శాతం
    ==> పిల్లలను ఇబ్బంది పెట్టవద్దని.. ఆందోళన చెందవద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వినతి 

  • 11:17 AM

    ==> అమ్మాయిలు 68.85 శాతం పాస్ 

    ==> అబ్బాయిలు 56.80 శాతం మంది పాస్ 

    ==> సెకండియర్ లో అమ్మాయిలు 73.46 శాతం పాస్ 

    ==> అబ్బాయిలు 60.66 శాతం పాస్ 

  • 11:16 AM

    ==> ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో మెదక్ జిల్లా చివరిస్థానంలో నిలిచింది.

  • 11:14 AM

    ==> ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లాకు మొదటిస్థానం
    ==> సెంకడియర్ ఫలితాల్లో ములుగు జిల్లా మొదటిస్థానంలో నిలిచాయి

  • 11:13 AM

    ==> ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందొద్దు
    ==> జూన్ 4వ తేదీ నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు

  • 11:11 AM

    ==> తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా 
    ==> ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 63.85 శాతం మంది ఉత్తీర్ణత
    ==> సెకండియర్‌లో 67.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు

  • 11:08 AM

    ==> రేపటి నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
    ==> ఎంసెట్ ఇంటర్ వెయిటెజ్ ఎత్తివేస్తున్నాం..: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

  • 11:06 AM

    ఒకేసారి ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిలీజ్ చేశారు.
     

  • 11:02 AM

    ఇంటర్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఫలితాలను tsbie.cgg.gov.in, results.cgg.gov.in, manabadi.com వెబ్‌సైట్లలో చెక్ చేసుకోండి.
     

  • 10:44 AM

    ఫలితాలను tsbie.cgg.gov.in, results.cgg.gov.in, manabadi.com వెబ్‌సైట్లలో చెక్ చేసుకోండి.
     

  • 10:39 AM

    ==> ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.inను సందర్శించండి. 
    ==> హోమ్ పేజీలో ఉన్న టీఎస్ ఇంటర్ ఫలితాలు 2023 లింక్‌పై క్లిక్ చేయండి. 
    ==> ఇక్కడ అవసరమైన వివరాలను ఎంటర్ చేసి.. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి. 
    ==> మీ రిజల్ట్స్ స్క్రీన్‌పై కనిపిస్తాయి

  • 10:34 AM

    ఎంసెట్‌, నీట్‌, జేఈఈ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఫలితాలను సాధ్యమైనంత తొందరగా విడుదల చేస్తున్నారు.
     

Trending News